2020 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని తొమ్మిది మేజర్ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వస్తు సేవల పన్ను (GST) పరిహారమే రూ.70,000 కోట్ల వరకు ఉంటుందని రేటింగ్ సంస్థ ICRA అంచనా వేసింది. గత కొంతకాలంగా వరుసగా జీఎస్టీ కలెక్షన్లు తగ్గుతున్నాయి. దీనికి తోడు మందగమనం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. అలాగే వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. ఇలాంటి సమయంలో జీఎస్టీ కలెక్షన్లపై మరింత ప్రభావం పడుతుందని, 9 రాష్ట్రాలకే రూ.70,000 కోట్లు పరిహారం అంటే కేంద్రంపై పెద్ద భారమేనని అభిప్రాయపడుతున్నారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అంచనా వేసిన మొత్తం కంటే రూ.3.5 లక్షల కోట్లు తక్కువగా రెవెన్యూ వస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ అంచనా రూ.24.6 లక్షల కోట్లు. అన్ని రాష్ట్రాల కొరత రూ.2.2 లక్షల కోట్లుగా ఉంటుందని ICRA అంచనా వేస్తోంది. అదే సమయంలో రాష్ట్రాలకు పరిహారం విడుదలయ్యే చేసే సమయం కూడా కీలకం.

'2020 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది రాష్ట్రాలకు జీఎస్టీ కంపెన్షేషన్ రూ.60,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్ల మధ్య ఉంటుందని మా స్టడీలో తేలింది. 2019లో అందుకున్న పరిహారానికి ఇది దాదాపు రెండింతలు' అని ఇక్రా గ్రూప్ హెడ్ కార్పోరేట్ సెక్టార్ రేటింగ్ జయంత రాయ్ అన్నారు. ఆయా రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మిగతా నిధుల సేకరణ విధానంపై ప్రభావం చూపుతోందని పేర్కొంటున్నారు.
దీంతో రాష్ట్రాలకు రెండు విధాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయని, ఇది ఆయా రాష్ట్రాల సంక్షేమ పథకాలు, కరువు, వరద రిలీఫ్, వేతనాలపై ప్రభావం చూపుతుందని, దీంతో పాటు రాష్ట్రాలు స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ ఇష్యూరెన్స్‍ను పెంచుతాయని, అప్పుడు రాష్ట్ర ఆర్థిక లోటు అధికమవుతుందని అభిప్రాయపడింది. ఈ నివేదిక స్టడీలో కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications