జీఎస్టీ కలెక్షన్లు ఎందుకు తగ్గుతున్నాయంటే: ఐఎంఎఫ్
వివిధ రకాల ధరలు, మినహాయింపులు, అమలులో సవాళ్ల కారణంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) కలెక్షన్లు తగ్గడానికి కారణం అవుతున్నాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) టీమ్ వెల్లడించింది. 2018-19లో ఇండియా రిసోర్స్ మొబిలైజేషన్ అంచనా ప్రకారం జీడీపీలో జీఎస్టీ కలెక్షన్లు 5.8 శాతంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఇది బాగానే ఉంది. ఐఎంఎఫ్ టీంలో రూడ్ డీ మూజీ, అర్బింద్ మోడీ, లి ల్యూ, దినార్ ప్రిహాదిని, జూవాన్ కార్లోస్ బెనిటెజ్ ఉన్నారు.
వాస్తవ కలెక్షన్లకు, అంచనాలు లేదా రావాల్సిన వాటి కంటే భిన్నంగా ఉండటానికి వివిధ కారణాలు ఉన్నాయని ఐఎంఎఫ్ టీమ్ పేర్కొంది. ఆహార ఉత్పత్తుల మినహాయింపు కారణంగా జీడీపీ 0.4 శాతంగా పెరుగుతుందని అంచనా.

చాలా దేశాలలో ఒకటి రెండు లేదా రెండు రేట్ల విభాగాలు ఉంటే, ఇండియాలో ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడింది. అలాగే, జీఎస్టీ నెట్‌లోకి వ్యాపారాలను చేర్చేందుకు ఆదాయ పరిమితి సామర్థ్యం ఉంది. ఇలాంటి కారణాలతో జీఎస్టీ కలెక్షన్లు తగ్గినట్లు అభిప్రాయపడింది.
అలాగే, ఎలక్ట్రానిక్ ఫైలింగ్ లేదా రిటర్న్స్, ఈ-వే బిల్లులు, ఇన్వాయిస్ క్రాస్ మ్యాచింగ్ సహా వివిధ సవాళ్లు ఉన్నట్లు పేర్కొంది. వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నట్లుగా అభిప్రాయపడింది. కాగా, జీఎస్టీ వసూళ్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం జీఎస్టీ డిజైన్ లోపాలు, లూప్‌హోల్స్‌పై దృష్టి సారించింది.


Click it and Unblock the Notifications