లాక్‌డౌన్ సరే కానీ: ప్రధాని మోడీకి ఆర్పీఐ మాజీ గవర్నర్ ప్రశ్న
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ స్పందించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలోని తొలి క్వార్టర్‌సో భారత వృద్ధి రేటు నెగిటివ్‌లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మిగతా క్వార్టర్‌లలో కోలుకొని వృద్ధి రేటు 3.5 శాతానికి చేరుకోవచ్చునని చెబుతున్నారు.

లాక్ డౌన్ సరే కానీ..
కరోనాను అదుపు చేసేందుకు లాక్ డౌన్ పొడిగింపు అవసరమేనని అదే సమయంలో రోజువారీ కూలీలు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు, ప్రణాళికలను కూడా ప్రకటిస్తే బాగుండేదని రంగరాజన్ అన్నారు. లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా ఇబ్బందులు పడేది పేదలు, రోజువారీ కూలీలే అన్నారు. ఫ్యాక్టరీలు మూతపడడం వల్ల నష్టపోయేదీ కూడా వీరే అన్నారు. వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

మోడీ అవి ప్రకటిస్తే బాగుండు
ఉపాధి కోల్పోయిన రోజువారీ, వలస కూలీలకు ఏం ప్రయోజనాలు చేకూరుస్తారో ప్రధాని మోడీ ప్రకటిస్తే బాగుండేదన్నారు. బుధవారం సరళీకరించిన లాక్ డౌన్ నిబంధనలలోనైనా కనీసం వారికి ఏ విధంగా సాయం చేయనుంది ప్రకటించి ఉండాల్సిందని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో తొలి క్వార్టర్‌లో ప్రతికూల వృద్ధిరేటు నమోదవుతుందని అంచనా వేసారు. తర్వాతి త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే జీడీపీ వృద్ధిరేటు మొత్తం ఏడాదికి 3.5 శాతంగా మాత్రమే ఉంటుందన్నారు.

ఆర్బీఐ, ప్రభుత్వ సహకారం..
లాక్ డౌన్ వల్ల వృద్ధి రేటుపై భారీగా ప్రభావం పడుతుందన్నారు. ప్రభుత్వం ఎక్కువ రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వానికి ద్రవ్య లభ్యత కోసం ఆర్బీఐ కూడా ఏదో రకంగా సహకరించాల్సి ఉంటుందని చెప్పారు.


Click it and Unblock the Notifications