2 వారాల్లో 5,000 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంటాం
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాలకు ఆన్ లైన్ ద్వారా డిమాండ్ పెరిగింది. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో సామర్థ్యం పెంచుకునేందుకు కొత్తగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఆన్‌లైన్ ఆర్డర్స్ నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్ తెలిపింది. తమ యాప్ ద్వారా ఆర్డర్లు ఇచ్చేందుకు రోజుకు 15 లక్షలమంది ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
లాక్ డౌన్ కారణంగా ఆన్‌లైన్ ఆర్డర్లకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రానున్న రెండు వారాల్లో 5,000 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని గోఫర్స్ తెలిపింది. అంతేకాదు, మెట్రో నగరాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో జత కట్టింది. గ్రోఫర్స్ కో ఫౌండర్, సీఈవో అల్బిందర్ దిండ్సా మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో తమ యాప్ ద్వారా 1.5 మిలియన్ల మంది ఆర్డర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
తాము ప్రతి ఎనిమిది మంది కస్టమర్లలో ఒకరికి మాత్రమే సేవలు అందించగలుగుతున్నామని, అందుకే మరింత సామర్థ్యాన్ని పెంచుకుంటామని అల్బిందర్ చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఈ-కామర్స్ వెబ్ సైట్లు కస్టమర్లకు నిత్యావసరాలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, అధికారులు అడ్డుకునే పరిస్థితులు ఎదుర్కొన్నారు.

ప్రజలకు నిత్యావసరాలు, ఫుడ్ అందించేందుకు ఈ-కామర్స్ వెబ్ సైట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయినప్పటికీ కాస్త డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు, ఆన్‌లైన్ వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో అందరికీ సేవలు అందించలేని పరిస్థితులు కూడా ఎదురువుతున్నాయి.
24 నగరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ గిడ్డంగులలో 70 శాతం నిత్యావసరాలు ఉన్నాయని, కరోనా కారణంగా దెబ్బతిన్న టెక్స్‌టైల్, మానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల నుండి ఇప్పటికే 2000 మందిని తీసుకున్నామని, మరో 5,000 మంది ఉద్యోగులను రానున్న రెండు వారాల్లో తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు వారం గ్రోఫర్స్ రైవల్ బిగ్‌బాస్కెట్ 10,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించింది. గత మూడు వారాల్లో 22 నగరాల్లో 10 లక్షల ఆర్డర్స్ డెలివరీ చేసినట్లు అల్బిందర్ దిండ్సా తెలిపారు.


Click it and Unblock the Notifications