Green Energy: దేశంలో ఇంధన వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే అధారపడవలసి వస్తుంది. దీనికి ఇప్పుడు భారత్ ప్రత్నామ్నాయాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో.. శిలాజ ఇంధనాల నుంచి క్లీన్ ఎనర్జీకి మారటం అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఇది 2025 నాటికి దేశంలో 1.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించగలదు. దీనితో పాటు విద్యుత్ బిల్లుల ఖర్చుపై ఆదా పెరుగుతుంది. జీ-7 నేతల సదస్సుకు ముందు గురువారం విడుదల చేసిన కొత్త నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. 'గ్రోయింగ్ జాబ్స్ అండ్ కటింగ్ బిల్లులు: క్లీన్ ఎనర్జీకి తరలించడానికి ఆర్థిక అవకాశాలు' అనే నివేదికను 'వీ మీన్ బిజినెస్ కొలేషన్' కేంబ్రిడ్జ్ ఎకనామెట్రిక్స్ ప్రచురించాయి.

కరెంటు బిల్లు తగ్గింపు..
2025 నాటికి భారతదేశం తలసరి విద్యుత్ వ్యయాన్ని ఎనిమిది డాలర్లు లేదా 10 శాతం తగ్గించుకోవచ్చని నివేదిక పేర్కొంది. దేశంలో ఈ కోత 2030 నాటికి 34 డాలర్లు లేదా 31 శాతానికి, 2035 నాటికి 74 డాలర్లు లేదా 52 శాతంగా అంచనా వేయటం జరిగింది.

క్లీన్ ఎనర్జీతో 1.5 కోట్ల ఉద్యోగాల సృష్టి..
మరోవైపు ఉద్యోగాల పరంగా.. 2025 నాటికి క్లీన్ ఎనర్జీ వైపు వేగంగా వెళ్లడం వల్ల భారత్ 1.5 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని నివేదిక పేర్కొంది. 2025 నాటికి అన్ని శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ప్రభుత్వాలు ఈ సంవత్సరం జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయని ఇందులో పేర్కొంది.

బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేత..
2030 నాటికి దేశీయ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్‌లను దశలవారీగా నిలిపివేయాలని, రాబోయే ఎనిమిదేళ్లలో 70 శాతం లక్ష్యాన్ని సాధించడానికి పునరుత్పాదక(గ్రీన్ ఎనర్జీ) ఇంధన వినియోగాన్ని వేగంగా పెంచాలని G-7 దేశాలకు పిలుపునిచ్చింది. "వాతావరణ, ఆర్థిక విపత్తు నుంచి ప్రపంచ ప్రజలను రక్షించడానికి ఈ నివేదికలో పేర్కొన్న విధానాలను అమలు చేయాలని G-7 నాయకులను కోరినట్లు" వి మీన్ బిజినెస్ కూటమి CEOట మెండెలస్ అన్నారు.


Click it and Unblock the Notifications