దేశంలో ని ఉద్యోగస్తులకు అందరికీ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ లభించబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. ఉద్యోగులకు ఇచ్చే గ్రాచుటీ విషయంలో భారీ సడలింపులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం 5 ఏళ్లుగా ఉన్న పరిమితిని తగ్గించి కోట్ల మంది ఉద్యోగులకు దాంతో ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మింట్ రాసిన కథనాన్ని కోట్ చేస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం ఉద్యోగులకు వర్తించే గ్రాచుటీ ని ఇక ముందు ఏడాదికి కుదించే అవకాశాలు ఉన్నాయి.
అప్పుడు దాదాపు ప్రతి ఉద్యోగికి దాని ప్రయోజనం దక్కుతుంది. ప్రస్తుతమున్న 5 ఏళ్ళ పరిమితి వల్ల మెజారిటీ ఉద్యోగులకు లబ్ది చేకూరటం లేదు. కానీ దానిని ఏడాది కి కుదిస్తే ఇకపై దాదాపు ప్రతి ఉద్యోగికి లభ్ది చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతున్నాయి.

ఏమిటీ గ్రాచుటీ ...
పర్మనెంట్ ఉద్యోగికి ప్రోవిడెంట్ ఫండ్ (పీఎఫ్) అందించినట్లే... గ్రాచుటీ కూడా లభిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం... ఒక ఉద్యోగి ఒక కంపెనీలో వరుసగా 5 సంవత్సరాలు పనిచేస్తే గ్రాచుటీ పొందేందుకు అర్హులు అవుతారు. దీంతో సదరు ఉద్యోగికి ఏడాదికి 15 రోజుల వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 5 ఏళ్లకు గాను 75 రోజుల వేతనం లభిస్తుందన్న మాట.
అయితే దీనిని సాధారణంగా ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళుతున్నప్పుడు కానీ... పదవీ విరమణ సమయంలో కానీ చెల్లిస్తారు. ఒక ఉద్యోగి ఒకే కంపెనీలో 30 ఏళ్ళు పనిచేసినా... లేదా ఒక్కో కంపెనీలో 5 ఏళ్లకు పైగా వివిధ కంపెనీల్లో పనిచేసినా... అతనికి లేదా ఆమెకు 450 రోజులకు సమాన వేతనం గ్రాచుటీ రూపంలో లభిస్తుంది. దీంతో ఉద్యోగికి ఒకవైపు పీఎఫ్, మరో వైపు గ్రాచుటీ కలిపి పెద్ద మొత్తంలో ఒక నిధి ఏర్పాటవుతుంది. అది రిటైర్మెంట్ తర్వాత జీవితానికి భరోసా కల్పిస్తుంది.

ఇప్పుడున్న ఇబ్బంది ఏమిటి?..
ప్రస్తుతం 5 ఏళ్ళ కనిష్ట పరిమితి ఉండటం వల్ల 90% మంది ఉద్యోగులకు ప్రయోజనం లభించటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు ఒకే కంపెనీలో వరుసగా 5 ఏళ్ళు పనిచేయటం అరుదుగా జరుగుతుంది. ఒకవేళ పనిచేసినా.. కూడా కంపెనీల యాజమాన్యాలు ఏదో ఒక సాకుతో మధ్యలో ఒక 15 రోజులో, నెల రోజులో వారి ఉద్యోగ నియామక ఒప్పందానికి తాత్కాలిక బ్రేక్ పడేలా చర్యలు తీసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
దీంతో గ్రాచుటీ ప్రయోజనం వారికి దక్కటం లేదు. అతి తక్కువ మందికి మాత్రమే ఇది వర్తిస్తోంది. అందుకే, ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారిస్తోంది. మరోవైపు దేశంలో ఉద్యోగాల విషయంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఈ మార్పు మరింత అధికం కాబోతోంది. కాబట్టి, నిబంధనల్లో మార్పులు అవసరం అని భావిస్తున్నారు.

ఎంతకు తగ్గించొచ్చు...
గ్రాచుటీ విషయంలో ఇప్పుడున్న 5 ఏళ్ళ నిబంధన ను సడలింపు ఇస్తూ 1 ఏడాది లేదా 3 ఏళ్లకు కుదించే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది. దీని వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు కూడా గ్రాచుటీ ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగాల కాంట్రాక్టు నిబంధనలు కూడా భారీగా మారిపోతున్నాయి.
పరిమిత కాలానికి ఉద్యోగులను నియమించుకునేందుకు విధానం అవలంబిస్తున్నారు. కాబట్టి, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ళ కాల పరిమితి కాంట్రాక్టుకు కూడా ఈ విధానం మేలు చేస్తుంది. కాబట్టి, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉండటంతో ఇది త్వరలోనే అమల్లోకి రావొచ్చని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications