ముంబై: ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్.. తన మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు మించిన నెట్ ప్రాఫిట్‌ను సాధించింది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా సారథ్యాన్ని వహిస్తోన్న కంపెనీల్లో ఇదీ ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి ముగిసిన మూడో త్రైమాసికం ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలను ఎక్స్ఛేంజ్‌లో ఫైల్ చేసింది.
అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్య కాలానికి 522.47 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే 46 శాతం వృద్ధి సాధించింది. గత ఏడాది డిసెంబర్ నాటికి ముగిసిన మూడో త్రైమాసికంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సాధించిన నెట్ ప్రాఫిట్ 357.87 కోట్ల రూపాయలు. వ్యాపార లావాదేవీల వల్ల వచ్చిన ఆదాయంలోనూ 56.48 శాతం వృద్ధిని కనపరిచింది. గత ఏడాది ఇదే కాలానికి 3,696.61 కోట్ల రూపాయలు కాగా.. ఈ సంవత్సరం మూడో త్రైమాసికానికి 5,784.74 కోట్ల రూపాయలకు చేరినట్లు పేర్కొంది.

కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఆపరేషన్స్ 2,621.96 కోట్ల రూపాయలకు చేరినట్లు ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన తన ప్రతిపాదనల్లో వివరించింది ఈ టెక్స్‌టైల్ జెయింట్. గత సంవత్సరం మూడో త్రైమాసికంతో పోల్చుకుంటే 23.09 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2,130.10 కోట్ల రూపాయలు కాగా.. ఈ సారి ఈ మొత్తం పెరిగింది. కంపెనీ ఇంటరెస్ట్, ట్యాక్సెస్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ (ఈబీటీడీఏ) 43.1 శాతం పెరుగుదలతో 922 కోట్లకు చేరింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications