రూపాయి పతనంపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్.. అర్ధరాత్రి భారీ నిర్ణయం! అదేంటంటే..

ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ కొన్ని గ్లోబల్ టెన్షన్ల వల్ల ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఈ ఏడాదే 6 శాతానికి పైగా పడిపోయింది. మరోవైపు ఇరాన్ యుద్ధ వాతావరణం వల్ల క్రూడాయిల్ ధరలు మండిపోతున్నాయి. వీటన్నింటికీ తోడు విదేశీ ఇన్వెస్టర్లు (FPIs) మన స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ. 2.25 లక్షల కోట్ల నుండి రూ. 2.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు మోదీ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ ఆదాయపు పన్ను చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కేబినెట్ ఒక అత్యవసర ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.

Govt Abolishes 12 5 LTCG On Foreign Investment In Government Bonds Rupee Fall

అసలు ఏంటా నిర్ణయం? ఎవరికి లాభం?

భారత ప్రభుత్వ బాండ్లలో (Government Securities) పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లపై ఉన్న 12.5% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) ను కేంద్రం పూర్తిగా రద్దు చేసింది. పార్లమెంట్ సమావేశాల వరకు ఆగకుండా, ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ రూట్‌ను ఎంచుకుంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఇది అమల్లోకి వస్తుంది.

ఇంతే కాకుండా, ఈ బాండ్ల ద్వారా విదేశీయులకు వచ్చే వడ్డీ ఆదాయంపై ఉన్న 20% విత్‌హోల్డింగ్ ట్యాక్స్ (Withholding Tax) ను కూడా ప్రభుత్వం తొలగించబోతున్నట్లు సమాచారం. దీనివల్ల విదేశీ ఇన్వెస్టర్లకు టాక్స్ పోగా మిగిలే లాభాలు (Returns) భారీగా పెరుగుతాయి.

ఈ టాక్స్ బ్రేక్ ఇప్పుడెందుకు?

మన మార్కెట్లలో సాధారణంగా విదేశీయులు షార్ట్-టర్మ్ (స్వల్పకాలిక) లాభాల కోసం స్టాక్స్ కొంటుంటారు. మార్కెట్ కొంచెం అటూ ఇటూ అవ్వగానే ఆ డబ్బును వెనక్కి తీసేసుకుంటారు. దీనివల్ల రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది.

అదే ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడితే ఆ డబ్బు ఎక్కువ కాలం దేశంలోనే ఉంటుంది. అందుకే విదేశీయులు మన ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చే ఈ బాండ్ల పెట్టుబడులపై LTCG పన్నును తీసేశారు. దీనివల్ల భారీగా విదేశీ నిధులు ఇండియాకు వస్తాయి. తద్వారా రూపాయి మరింత పడిపోకుండా బలం పుంజుకుంటుంది.

బడ్జెట్ నిర్ణయంపై కేంద్రం యూ-టర్న్!

నిజానికి 2023 లోనే ప్రభుత్వం ఈ పన్ను మినహాయింపులను తీసేసి పన్ను పెంచింది. ఆ తర్వాత రీసెంట్ బడ్జెట్‌లో కూడా చాలా ఆస్తులపై LTCG ని 10 శాతం నుండి 12.5 శాతానికి పెంచారు. కానీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల (Geopolitical Tensions) నేపథ్యంలో విదేశీ నిధులు చాలా అవసరం కావడంతో ప్రభుత్వం తన పాత నిర్ణయాన్ని మార్చుకుని ఈ సంచలన యూ-టర్న్ తీసుకుంది.

ఈ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయితే, బ్రెజిల్ లాంటి దేశాల తరహాలోనే ఇండియాలోనూ బాండ్ మార్కెట్ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి కుదుపులు వచ్చినా తట్టుకునే శక్తి మన రూపాయికి వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ బోల్డ్ స్టెప్ భవిష్యత్తులో దేశ ఆర్థిక రంగాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+