దేశంలో కొత్త బిజినెస్ ల ఏర్పాటు ఇకపై చాలా సులభతరం కానుంది. కేవలం 5 రోజుల్లోనే కొత్తగా ఏర్పాటు చేసే బిజినెస్ లకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేలా ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. కంపెనీ రిజిస్ట్రేషన్ నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ వరకు అన్నీ కూడా ఈ గడువులోనే లభిస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం) విభాగంలో ప్రపంచంలోనే భారత్ ను మెరుగైన స్థానంలో నిలపాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. కొత్తగా వ్యాపారాలు పెట్టాలని, తమ కాళ్లపై తాము నిలబడాలని చాలా మందికి ఆశలు ఉంటాయి.
కానీ దేశంలో ఒక చిన్న కిరాణ కొట్టు పెట్టాలంటేనే 26 రకాల అనుమతులు అవసరమవుతాయి. ఇక ఒక కంపెనీ నెలకొల్పాలంటే ఎంత ప్రయాస పడాలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే మన దేశంలో మనవారే కాకుండా విదేశీయులు కంపెనీలు నెలకొల్పాలంటే కూడా జడుసుకొంటారు. కొన్నిసార్లు అనుమతులు లభించేందుకు సంవత్సరాలు కూడా గడిచిపోతుంటాయి. ఈ నేపథ్యంలో దేశంలో స్టార్టుప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు, యువకులను కేవలం ఉద్యోగాలు చేసే వారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా ప్రభుత్వం ఇలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకొంటోంది.

ఆన్లైన్ లోనే అన్నీ...
కంపెనీల పేరు రిజర్వు చేసుకోవటం, పేరు నమోదు చేసుకోవటం, జీఎస్టీ రిజిస్ట్రేషన్, కంపెనీ పాన్ కార్డు, టాన్ నెంబర్, ఈపీఎఫ్ఓ, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (డీఐఎన్), బ్యాంకు అకౌంట్, ప్రొఫెషనల్ టాక్స్ రిజిస్ట్రేషన్ ఇలా సర్వం కేవలం 5 రోజుల్లో పూర్తయ్యేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకొంటోంది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. మరో నెల రోజుల్లో ఈ దిశగా ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ నిబంధనల ప్రకారం ఒక కొత్త కంపెనీ ని ఏర్పాటు చేసేప్పుడు కనీసం 10 రకాల ప్రాసెస్ లు, 18 రోజుల సమయం పడుతోంది. కానీ మన దేశంలో అంతకంటే మెరుగ్గా ఉండాలని ప్రభుతం భావిస్తోంది. అందుకే ప్రపంచ స్థాయి ప్రమాణాల్లో సగానికి పైగా తగ్గించి కేవలం 5 ప్రాసెస్ లు , 5 రోజుల సమయంలో అనుమతులన్నీ ఇవ్వాలని ప్రభుత్వం లక్యంగా పెట్టుకుంది.

రెండే ఫార్మ్స్...
ప్రస్తుతం చాలా సంక్లిష్టంగా ఉండే కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై చాలా సరళంగా ఉండబోతోంది. ఇందుకోసం ఎంసీఏ రెండు ప్రత్యేక ఫారం లు రూపొందిస్తోంది. 'స్పైస్ ప్లస్' , 'అజైల్ ప్రో' అనే రెండు ఫారం లు చాలా వరకు ప్రాసెస్ లను సులభతరం చేయనున్నాయి. ఈ రెండు ఫారం లతోనే మొత్తం కొత్త బిజినెస్ ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇలాంటి చర్యలు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. అసలే నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలన్నా... కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా విధానాలు మారాల్సి ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే బడ్జెట్ కు ముందే ఈ ప్రక్రియ పూర్తిచేస్తే... కొత్త బడ్జెట్ సందర్భంగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.

63 వ ర్యాంకు...
ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో భారత్ చాలా వెనుకబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు గాను 136 దేశాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉందన్న పరిశోధన చేసి వరల్డ్ బ్యాంకు ఇటీవల ఒక నివేదిక రూపిందించింది. అందులో మన దేశానికి 63వ ర్యాంకు లభించింది. మన కన్నా చిన్న చిన్న దేశాలు, అది కూడా ఆఫ్రికా దేశాలు కూడా ఈ విషయంలో మెరుగ్గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఒక ఏడాదిలోనే 50 వ ర్యాంకు లోపు నకు ఇండియా ను చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరో వైపు చాలా అభివృద్ధి చెందిన దేశాలు సహా సింగపూర్ వంటి దేశాల్లో కొత్త వ్యాపారాల ప్రారంభ ప్రక్రియ ఒక వారం రోజుల్లోనే పూర్తవుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications