ఏపీ తర్వాత తెలంగాణలో ఊరట: అక్కడ కిలో ఉల్లి రూ.40 మాత్రమే!

హైదరాబాద్: ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక వంటి పంట పండే రాష్ట్రాల్లో భారీ వరదలు, వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో ధరలు కొన్ని చోట్ల రూ.100 పైకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తక్కువ ధరకు ఉల్లిని సరఫరా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్లలో రూ.25కి కిలో ఉల్లిని సరఫరా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఉల్లి ధరల నుంచి ఊరట కల్పిస్తోంది.

ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.40కే కిలో ఉల్లిని ప్రజలకు అందించాలని నిర్ణయించింది. వ్యాపారుల నుంచి మార్కెటింగ్ శాఖ సేకరించి విక్రయిస్తుంది. ఇందులో భాగంగా వ్యాపారులతో చర్చలు జరిపారు. కిలో ఉల్లిని రూ.40కే ప్రభుత్వానికి ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించారు. మలక్‌పేట మార్కెట్లోని వ్యాపారులు కూడా అంగీకరించారు.

Government to sell onion at Rs 40/kg in some Rythu bazaars from today

హమాలీ, రవాణా ఛార్జీల్ని మార్కెటింగ్ శాఖ భరిస్తుంది. దీంతో బుధవారం నుంచి నగరంలోని మోహదీపట్నం, సరూర్ నగర్ రైతు బజార్లో కిలో ఉల్లి రూ.40కే లభిస్తోంది. దశలవారీగా అన్ని రైతు బజార్లలో ఉల్లిని విక్రయిస్తారు. ఒక వినియోగదారునికి ఒక కిలో ఉల్లి మాత్రమే ఇస్తారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+