For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనిల్ అంబానీ RComకు రూ.104 కోట్లు చెల్లించాల్సిందే: కేంద్రానికి సుప్రీం కోర్టు

|

ఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom)కు రూ.104 కోట్లు చెల్లించాలన్న టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (TDSAT) ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇటీవల సవాల్ చేసింది. అయితే కేంద్రం వ్యాజ్యాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది.

కేంద్రం వాదనకు బలమైన కారణాలు కనిపించడం లేదని జస్టిస్ నారీమన్, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. స్పెక్ట్రం ఛార్జీలపై పెట్టిన రూ.908 కోట్ల పూచీకత్తులో రూ.774 కోట్ల ఛార్జీల మొత్తం పోను మిగిలిన సొమ్మును చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని RCom టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది.

మందగమనం వదిలేసి, ఇన్వెస్ట్ చేయండి: పారిశ్రామికవేత్తలతో మోడీమందగమనం వదిలేసి, ఇన్వెస్ట్ చేయండి: పారిశ్రామికవేత్తలతో మోడీ

Government To Refund Rs 104 Crore To RCom After Top Court Rejects Request

దీనిపై విచారణ జరిపిన TDSAT మిగతా దాదాపు రూ.104.34 కోట్లు చెల్లించాలని డిసెంబర్ 2018లో ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర టెలికం విభాగం రూ.30.33 కోట్లు ఆర్‌కామ్‌కు చెల్లించింది. దీనిపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేయగా చుక్కెదురైంది. ఈ పిటిషన్‌లో బలమైన కారణాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు చెప్పారు.

English summary

అనిల్ అంబానీ RComకు రూ.104 కోట్లు చెల్లించాల్సిందే: కేంద్రానికి సుప్రీం కోర్టు | Government To Refund Rs 104 Crore To RCom After Top Court Rejects Request

The Supreme Court on Tuesday rejected the government's plea challenging a refund of Rs 104.34 crore to Reliance Communications (RCom).
Story first published: Tuesday, January 7, 2020, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X