High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
High Tax: ఎవరైనా పెట్టుబడులు పెట్టేది నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే. అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా సంపద వస్తే ఎక్కువగానే ఉంటుంది.. అలా అని పోయినప్పుడు సైతం ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తోంది.

పెట్టుబడులపై పన్ను..
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(FPI) ఇన్వెస్టర్లకు 2013 నుంచి ఉన్న తక్కువ పన్ను వెసులుబాటును వెనక్కి తీసుకుంటున్నారు. వారు భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ & విదేశీ కరెన్సీ బాండ్ల నుంచి సంపాదించే వడ్డీపై ప్రాధాన్యత పన్ను రేటును ఇకపై కోల్పోతారని సీనియర్ టాక్స్ అధికారి శనివారం తెలిపారు. దీనివల్ల డెట్ సెక్యూరిటీలైన బాండ్లలో పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయానికి గతంలో ఉన్న 5 శాతం టాక్స్ ఇకపై 20 శాతానికి పెరగనుంది.

కొత్త రేటు ఎప్పటి నుంచి..
2013 నుంచి తక్కువ పన్ను విధానాన్ని ముగించాలని కేంద్రం నిర్ణయించటంతో ఇకపై ఎఫ్పీఐలు భారీగా టాక్స్ చెల్లించాల్సిందే. అయితే ఈ విధానం జూలై 1 నుంచి అమలులోకి వస్తోంది. గతంలో ఉన్న తక్కువ పన్ను వెసులుబాటును పొడిగించలేదని అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ నితిన్ గుప్తా రాయిటర్స్‌కు వెల్లడించారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వదులుకున్న ఆదాయమేనని ఆయన తెలిపారు.

ట్రస్తుల రూపంలో..
స్వచ్ఛంద ట్రస్టుల ద్వారా రెగ్యులర్ రిజిస్ట్రేషన్.. లాభదాయకమైన యజమానుల డేటాను సేకరించడంలో భారతదేశానికి సహాయపడుతుందని నితిన్ గుప్తా వెల్లడించారు. గ్లోబల్ మనీలాండరింగ్ అండ్ టెర్రరిజం వాచ్‌డాగ్ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చే ప్రమాణాలకు అనుగుణంగా ఇది ఉంటుందని గుప్తా తెలిపారు. ట్రస్టుల గురించి చాలా ఆందోళన ఉందని ఆయన చెప్పారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు, మనీలాండరింగ్‌కు ఇవి అడ్డాలుగా మారాయని అన్నారు. అందువల్ల ఇటీవల ఛారిటబుల్ ట్రస్ట్‌ల కోసం వరుస మార్పులను ప్రతిపాదించింది.


Click it and Unblock the Notifications