న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయార్ధంలో కేంద్ర ప్రభుత్వం రూ.4.34 లక్షల కోట్ల అప్పులు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల రుణ లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. సెప్టెంబర్‌లో ముగిసిన ప్రథమార్థంలో రూ.7.66 లక్షల కోట్ల రుణాలు తీసుకుంది. ప్రథమార్థంలో రూ.6.98 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఏడున్నర లక్షల కోట్ల రుణాలు దాటాయి. మార్కెట్ నుండి రూ.12 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటామని మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది.

రుణ లక్ష్యం 50 శాతం పెంపు
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.7.8 లక్షల కోట్ల మార్కెట్ రుణాలను లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే కరోనా కారణంగా దీనిని 50 శాతం పెంచి రూ.12 లక్షల కోట్లకు పెంచవలసిన పరిస్థితి వచ్చింది. బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్ట్ చివరి నాటికి కేంద్ర ఆర్థిక ద్రవ్యలోటు రూ.8.7 లక్షల కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి బడ్జెట్‌లో అందించిన రూ.7.96 లక్షల కోట్ల కంటే 9.3 శాతం ఎక్కువ. FY21లో ద్రవ్యలోటు రూ.14 లక్షల కోట్ల నుండి రూ.18 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చునని నిపుణుల అంచనా. జూన్ నుండి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఆదాయంలో క్రమంగా మెరుగు కనిపిస్తోందని తరుణ్ బజాజ్ అన్నారు.

భారీ ప్యాకేజీ ఉండకపోవచ్చు
ఓ వైపు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరోవైపు రుణ లక్ష్యం రూ.12 లక్షల కోట్లకు కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. రుణాల్లో మార్పులేదని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి కేంద్రం భారీ ఉద్దీపనకు ముందుకు వెళ్లకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మద్దతు కోసం మరో భారీ ప్యాకేజీ ఆశలు సన్నగిల్లాయని అంటున్నారు. అదనపు ఖర్చులతో కూడిన ఉద్దీపన ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే ఎంతోకొంత ప్యాకేజీ రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్రం రెండో అర్ధ సంవత్సరంలో రూ.4.34 లక్షల కోట్ల రుణాలు తీసుకోనుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.2.1 లక్షల కోట్లను పెట్టుకుంది. కానీ కరోనా నేపథ్యంలో ఇది వెనుకబడింది.

ద్రవ్యలోటు పెరిగింది
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయాల్లో కొరత నేపథ్యంలో ఆగస్ట్‌లో వరుసగా రెండో నెల కూడా ద్రవ్యలోటు పెరిగింది. ఏప్రిల్-ఆగస్ట్ నెలలమధ్య కాలంలో ద్రవ్యలోటు వార్షిక లక్ష్యంలో 109.3 శాతం ఉంది. గత ఏడాది మొత్తం మీద ద్రవ్యలోటు ఏడేళ్ల గరిష్ఠస్థాయి 4.6 శాతంగా నమోదయింది. కరెంట్ ఖాతా మిగులు జూన్ క్వార్టర్‌లో జీడీపీలో 3.9 శాతానికి పెరిగి 1,980 కోట్ల డాలర్లకు (రూ.1.49 లక్షల కోట్లు) చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications