అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన వీసా విధానాల ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో, భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారత మూల పరిశోధకులు, శాస్త్రవేత్తలను తిరిగి భారత్‌లోకి తీసుకురావడానికి ఒక కొత్త పథకాన్ని సిద్ధం చేస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఈ పథకం కింద విదేశాల్లో పనిచేస్తున్న "స్టార్ ఫ్యాకల్టీ" మరియు ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు దేశంలోని ప్రముఖ IITలు, పరిశోధనా ల్యాబ్‌లు, మరియు సైన్స్ & టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా భారత్‌లో పరిశోధన స్థాయిని పెంచి, శాస్త్రవేత్తల మధ్య దీర్ఘకాల సహకారం ఏర్పడుతుంది.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఇటీవల H-1B వీసా ఫీజును భారీగా పెంచడం, విదేశీ విద్యార్థులపై పరిమితులు విధించడం, అలాగే ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా వేలాది ఫెడరల్ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారడం వంటివి విద్యా వ్యవస్థపై గట్టి ప్రభావం చూపాయి. ముఖ్యంగా విద్యా శాఖలో సిబ్బంది సగం మందిని తొలగించడం విద్యావేత్తల్లో ఆందోళనను పెంచింది.

భారత అధికారుల ప్రకారం, ఈ పథకం ద్వారా IITలు, DST (సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం), DBT (బయోటెక్నాలజీ విభాగం) వంటి ప్రధాన సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. మొదటగా 12-14 ముఖ్య రంగాలను - సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మరియు మాథమెటిక్స్ (STEM) - లక్ష్యంగా పెట్టి ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. తిరిగి వస్తున్న శాస్త్రవేత్తలకు "సెట్-అప్ గ్రాంట్" ఇవ్వడం ద్వారా వారు భారత్‌లోనే తమ ల్యాబ్‌లు, టీమ్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. IITల డైరెక్టర్లు ఇప్పటికే ఈ చర్చల్లో పాల్గొన్నారని సమాచారం.
MIT స్లోన్ స్కూల్ కి చెందిన డా. వైష్ణవ్ మాట్లాడుతూ, "భారత జీతాలు అమెరికా లేదా చైనాలో లాగ ఎక్కువ లేకపోయినా, ఇక్కడ ఉండే భావోద్వేగ అనుబంధం, గౌరవం చాలా మందిని తిరిగి ఆకర్షిస్తుంది. సరైన వ్యక్తులను ఎంపిక చేసి, వారికి స్వేచ్ఛ ఇచ్చి పని చేయనివ్వాలి" అని చెప్పారు. ఉదాహరణకు, భారత్‌లో ఒక ప్రొఫెసర్ సగటున సంవత్సరానికి USD 38,000 సంపాదిస్తారు. కానీ అమెరికాలో అది USD 130,000-200,000 (రూ.1.08 కోట్లు - రూ.1.66 కోట్లు), చైనాలో సుమారు USD 100,000 (రూ. 83 లక్షలు) వరకు ఉంటుంది.
ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి కొన్ని ముఖ్యమైన సవరణలు చేయనుంది. ఇందులో ప్రధానంగా నిధుల సమస్యలు లోపాలను తగ్గించడమే కాకుండా, పరిశోధన స్వాతంత్ర్యం, మేధో సంపత్తి హక్కులు (IPR), పదవీకాలం వ్యవస్థ వంటి అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం యూరప్, చైనా, తైవాన్ వంటి దేశాలు పెద్ద ఎత్తున విదేశీ పరిశోధకులను ఆకర్షించడానికి కొత్త సెంటర్లు, భారీ ఫండింగ్ ప్రోగ్రామ్‌లు ప్రారంభిస్తున్నాయి. భారత్ కూడా ఈ పోటీలో వెనుకబడకూడదని ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే VAJRA అనే ప్రోగ్రామ్ అమల్లో ఉంది. దీని ద్వారా విదేశీ పరిశోధకులు తాత్కాలికంగా భారత సంస్థలతో కలిసి పని చేయవచ్చు. కానీ 2017-18లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటివరకు కేవలం 100 ప్రాజెక్టులు మాత్రమే జరిగాయి. కాబట్టి ఈసారి ప్రభుత్వం దీన్ని మరింత బలంగా తీసుకెళ్లాలని చూస్తోంది. కొత్త పథకం ద్వారా ప్రపంచ స్థాయి ప్రతిభను తిరిగి భారత్ వైపు ఆకర్షించి, దేశం పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇలా ప్రతిభావంతులైన పరిశోధకులను భారత్‌కి తీసుకురవడం వల్ల దేశంలోని సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాలు మరింత బలపడతాయి. వారు తీసుకురానున్న కొత్త ఆవిష్కరణలు, ఆధునిక పరిశోధనా పద్ధతులు, అంతర్జాతీయ అనుభవం ద్వారా భారత్‌లో కొత్త ల్యాబ్‌లు, స్టార్టప్‌లు, మరియు టెక్నాలజీ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందతాయి. దీని ద్వారా యువ శాస్త్రవేత్తలకు కూడా ప్రేరణ కలిగి దేశంలోని పరిశోధన వాతావరణం మరింత సృజనాత్మకంగా మారుతుంది.
More From GoodReturns

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications