LPG Gas Cylinder: ప్రజలకు గ్యాస్ కష్టాలు.. సిలిండర్ కు రూ.200- రూ.300 భారం..!
LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అతిపెద్ద వార్త వెలువడింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలపై ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇకపై గ్యాస్ సిలిండర్ కొనాలంటే ప్రజలు ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందే. ఇది ద్రవ్యోల్బణ సమయంలో భారాన్ని మరింతగా పెంచుతుందని చెప్పుకోవాలి.

మినహాయింపుల రద్దు..
ప్రభుత్వ చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై రూ.200 - రూ.300 వరకు తగ్గింపు ఇస్తున్నాయి. అయితే ఇది ఇకపై రద్దు చేయబడింది. కమర్షియల్ సిలిండర్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్ల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

చమురు కంపెనీల ఉత్తర్వులు..
దేశంలోని మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హెచ్పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL)లు తమ తాజా నిర్ణయాన్ని ప్రకటించాయి. నవంబర్ 8 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చింది. 19 కిలోల నుంచి 47.5 కిలోల వరకు ఉండే కమర్షియల్ సిలిండర్లపై అందిస్తున్న అన్ని రాయితీలను రద్దు చేస్తున్నట్లు HPCL తెలిపింది.

14.2 కిలోల సిలిండర్..
ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,053గా ఉంది. కోల్‌కతాలో రూ.1,079, చెన్నైలో 1,068.50, ముంబైలో రూ.1,052కు గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు ధరలను తగ్గించక పోవటంతో గృహ వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణ సమయంలోనూ తమకు ఎలాంటి ఊరటను కేంద్ర ప్రభుత్వం కల్పించటం లేదని అంటున్నారు.

నెల ప్రారంభంలో..
జూలైలో సిలిండర్ పై ధర రూ.9 మేర తగ్గింది. అంతకుముందు.. జూన్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ.198 తగ్గింది. ఆగస్టులో రూ.36, సెప్టెంబర్ మాసంలో రూ.100, అక్టోబర్ నెలలో రూ.25.50 తగ్గింపు వచ్చింది. నవంబర్ నెలలో కంపెనీలు రూ.115.50 తగ్గింపు ప్రకటించటంతో.. మెుత్తంగా జూన్ నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్ ధర రూ.619 తగ్గింది. ఇది కమర్షియ సిలిండర్ వినియోగదారులకు పెద్ద ఊరట.


Click it and Unblock the Notifications