కరోనా మహమ్మారి కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. 40 రోజుల లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ప్రయివేటు కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం లేదా తొలగించడం చేస్తోంది. తెలంగాణ వంటి ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతానికి కోత విధిస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని మోడీ నుండి ఎంపీల వరకు అందరి వేతనాల్లో కోత విధించింది ఎన్డీయే ప్రభుత్వం. ఇలాంటి సమయంలో కొన్ని వదంతులు కూడా వస్తున్నాయి.

ఉద్యోగులందరికీ యథాతథంగా పింఛన్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పింఛన్‍లలో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి శాఖ స్పందించింది. అలాంటి వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ యథాతథంగా పింఛన్లు అందుతాయని వెల్లడించారు.

ఎలాంటి కోత లేదు
వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల వేతనాలు, ఫించన్లలో కోత విధించే ఆలోచన ఏదీ లేదని ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ట్వీట్ చేసింది. దీనిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ షేర్ చేశారు. ప్రభుత్వ నగదు నిర్వహణ ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల వేతనాలు, పెన్షన్లు ప్రబావితం కాదని పేర్కొంది కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ.

నెటిజన్ ట్వీట్‌తో..
ఉద్యోగుల కోతకు సంబంధించిన వదంతి అంశాన్ని ఓ ట్విట్టర్ యూజర్ నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకు వెళ్లారు. 'మేడమ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లో 20 శాతం కట్ అవుతుందని సోషల్ మీడియా, కొన్ని ఛానల్స్‌లో ప్రచారం సాగుతోందని, దీనిపై క్లారిటీ ఇవ్వండి' అని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ స్పందించింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications