మేకిన్ ఇండియాకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలోనే తయారీని పెంచడం, విదేశీ దిగుమతులను తగ్గించుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. అవసరంలేని వస్తువుల జాబితాలో ఉన్న టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్, వాణిజ్య మంత్రిత్వ శాఖలు సంబంధిత ప్రతిపాదనపై చర్చిస్తున్నాయని తెలుస్తోంది.

పరిమితులు విధిస్తే...
టీవీ దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలోకి ప్రాధాన్యం లేని ఉత్పత్తుల దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే విదేశాల నుంచి వస్తున్న టెలివిజన్ సెట్లపై పరిమితుల్ని విధించాలని చూస్తోంది. ఆంక్షలతో కూడిన దిగుమతి వస్తువుల గ్రూప్‌లోకి టీవీ సెట్స్‌ను తీసుకువస్తే విదేశాల నుంచి వీటిని తీసుకు రావడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ నుంచి లైసెన్స్ పొందాలి.

చైనా టాప్
2018-19 మధ్య కాలంలో దాదాపు ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.7వేల కోట్లకు పైగా) వ్యాల్యూ కలిగిన టీవీ సెట్స్ లేదా ఉత్పత్తులు దేశంలోకి వచ్చాయి. భారత్‌కు వీటిని ఎగుమతి చేస్తోన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వియత్నాం, మలేసియా, హాంకాంగ్, కొరియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, జర్మనీ ఉన్నాయి.

ఫర్నీచర్ దిగుమతులపై కూడా..
ఇండియాలోకి దిగుమతి అయ్యే విలువలో చైనా వాటా 535 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు సగానికి ఎక్కువ. వియత్నాం 327 మిలియన్ డాలర్లు, మలేషియా 109 మిలియన్ డాలర్లు, హాంకాంగ్ 10.52 మిలియన్ డాలర్లు మేర దిగుమతి అవుతున్నాయి. దేశీయంగా తయారీని పెంచడంలో భాగంగా ఫర్నీచర్ దిగుమతులపై కూడా ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications