ఆటోమొబైల్ కంపెనీలు సాంకేతికంగా లోపాలు ఉన్న వాహనాలను విక్రయిస్తే రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త నిబంధన అమలులోకి రానుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే తయారీ లోపాల కారణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాహనాలను తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి వస్తే వచ్చే నెల నుండి ఆటో కంపెనీలకు భారీ షాక్ తప్పదు. ఈ మేరకు బుధవారం సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది.

రీకాల్ ప్రక్రియ
ఏదేని వెహికిల్ మోడల్‌లో లోపానికి సంబంధించి నిర్దేశిత పరిమితికి మించి ఫిర్యాదులు అందిన పక్షంలో, ఆటో మొబైల్ కంపెనీలు ఆ మోడల్ వాహనాలను అన్నింటినీ తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి ఉంటుంది. రీకాల్ చేసిన వాహనాల్లో లోపాలను పరిష్కరించేందుకయ్యే వ్యయాన్ని భరించాలి. అలాగే ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అమ్మకాల్లో నిర్దిష్ట స్థాయిలో వెహికల్ రీకాల్ పోర్టల్‌కు ఫిర్యాదులు వస్తే తప్పనిసరిగా రీకాల్ చేయాలనే ఆదేశాలిచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇదివరకు.. ఇప్పుడు
వాహనాల సంఖ్య, రకాలను బట్టి రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు జరిమానా విధించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం మోటర్ వెహికల్స్ చట్టంలోని వాహనాల టెస్టింగ్, తప్పనిసరి రీకాల్ నిబంధనల ప్రకారం ఆటోమేకర్స్ లేదా దిగుమతి చేసుకునే సంస్థలు స్వచ్ఛందంగా రీకాల్ చేయకుంటే మాత్రమే పెనాల్టీ విధించవచ్చు. కొత్త నిబంధనలు 7 ఏళ్ల లోపు వాహనాలకు వర్తిస్తాయి. ఇక నుండి రోడ్లపై భద్రతాపరమైన రిస్క్ సృష్టించేలా వాహనంలో లేదా విడిభాగాల్లో లేదా సాఫ్టువేర్‌లో సమస్యలు ఉంటే లోపాలుగా పరిగణిస్తారు. ఫిర్యాదులను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఫిర్యాదుల ఆధారంగా ఆటో కంపెనీలకు నోటీసులు పంపిస్తారు. నెల రోజుల గడువు ఉంటుంది. రీకాల్ ఆేశాలకు ముందు విచారణ ఉంటుంది. ఆటో కంపెనీలు 90 రోజుల్లో కోర్టును ఆశ్రయించవచ్చు.

జరిమానా ఇలా
6 లక్షల పైగా బైక్స్, ఒక లక్షకు పైగా ఫోర్ వీలర్ తప్పనిసరిగా రీకాల్ చేయాలంటూ ఆదేశిస్తే వాహన కంపెనీలు గరిష్టంగా రూ.1 కోటి వరకు జరిమానా చెల్లించాలి. నైన్ సీటర్ ప్యాసింజర్ వెహికిల్స్, హెవీ గూడ్స్ వెహికల్స్ ను యాభై వేలకు పైగా రీకాల్ చేయాల్సి వస్తే రూ.1 కోటి వరకు పెనాల్టీ ఉంటుంది. మూడు లక్షల పైగా త్రీవీలర్స్‌ను రీకాల్ చేస్తే గరిష్టంగా ఈ జరిమానా ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications