వాహనదారులకు షాక్: ఇక పెట్రోల్, డీజిల్‌పై రూ.8 వరకు ఎప్పుడైనా పెంచుకోవచ్చు
పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.8 చొప్పున మున్ముందు ఎప్పుడైనా పెంచుకునేందుకు పార్లమెంటు అనుమతిని ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020 ఆర్థిక బిల్లులో ఈ మేరకు కీలకమైన సవరణను చేర్చారు. బిల్లుకు ఉభయ సభలు సోమవారం ఆమోదం తెలిపాయి. ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్ పైన రూ.18, డీజిల్ పైన రూ.12 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ మంత్రి సవరణ ప్రతిపాదించారు.

పెట్రోల్, డీజిల్‌పై అదనపు సుంకం
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో కూడిన ఫైనాన్స్ బిల్లు లోకసభలో ఎలాంటి చర్చలేకుండానే ఆమోదం లభించింది. పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున సుంకం పెంచుతూ ఈ నెల 14వ తేదీన కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాంతో కలిపి ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం గరిష్ట పరిమితి పెట్రోల్ పైన లీటకురు రూ.10, డీజిల్‌పై రూ.4 చొప్పున ఉన్నాయి.

ఇప్పుడు పెరగకపోయినా.. భవిష్యత్తులో ఎప్పుడంటే అప్పుడు
ఫైనాన్స్ బిల్లులోని ఎనిమిదో షెడ్యూలునుసవరించి దీనిని వరుసగా రూ.18, రూ.12గా మార్చారు. దీంతో ప్రస్తుతానికి ఎక్సైజ్ సుంకంలో నేరుగా మార్పు ఉండదని చెబుతున్నారు. కానీ భవిష్యత్తులో ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు లీటరుకు ఈ ధరను రెండు ఇంధనాలపై లీటర్‌కు రూ.8 పెంచుకోవచ్చు.

రూ.39,000 కోట్ల రాబడి
మార్చి 14 ప్రభు్తవం పెట్రోల్, డీజిల్‌పై రూ.3 సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఏడాదికి రూ.39,000 కోట్లు అదనంగా రానున్నాయి. రూ.3 సుంకం పెంపులో రూ.2 స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.1 రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఉంది.


Click it and Unblock the Notifications