టెలికో కష్టాలపై కేంద్రం కమిటీ, కస్టమర్లకు షాక్: ఉచిత కాల్స్ ఉండవ్.. చౌక డేటాకు నో!?

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెలికం కంపెనీలు 92,500 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కంపెనీలను ఈ కష్టాల నుంచి వెలుపలికి తెచ్చేందుకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దీనిని పరిశీలించేందుకు ప్రభుత్వం కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో స్పెక్ట్రం ఛార్జీలు తగ్గించడం, ఉచిత కాల్స్, చౌక ధరలకు డేటా వంటి భిన్న అంశాలు కూడా ఈ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఉండే అవకాశాలున్నాయి.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఆర్థిక ఒత్తిడి ఏమిటి?

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఆర్థిక ఒత్తిడి ఏమిటి?

టెలికం రంగానికి ఆర్థిక ప్యాకేజీని ఇచ్చే అంశాన్ని పరిశీలించడానికి ఒక అత్యున్నతస్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పెక్ట్రమ్ ఛార్జీలను తగ్గించడం మొదలు పలుచర్యలు చేపట్టాలనేది ప్రభుత్వం ఉద్దేశ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గుబా ఆధ్వర్యంలో ది కమిటీ ఆఫ్ సెక్రటరీస్‌ను ఏర్పాటు చేసింది. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి వెనుక గల కారణాలను పరిశీలించి, సమస్య పరిష్కారానికి లేదా సమస్యను తగ్గించేందుకు సూచనలు చేయాలని కమిటీని కేంద్రం కోరింది.

త్వరలో సిఫార్సులు అందించనున్న ప్యానల్

త్వరలో సిఫార్సులు అందించనున్న ప్యానల్

ఆర్థిక, న్యాయ, టెలికం శాఖల్లోని కార్యదర్శులు ఈ ప్యానల్‌లో ఉన్నారు. వాయు తరంగాల వినియోగ ఛార్జీ తగ్గింపుతో పాటు బిడ్‌లో గెలుచుకున్న స్పెక్ట్రంకు చేసే చెల్లింపులకు గడువును ఇవ్వడం తదితర డిమాండ్లను ఈ ప్యానెల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ట్రాయ్ కూడా వాయిస్, డేటా సేవలను కనీస ఛార్జీని రూపొందించే అవకాశాన్ని పరిశీలించనుందని చెబుతున్నారు. ప్యానల్ నిర్ణీత గడువులోగా తన సిఫార్సులను అందించవచ్చు.

టెలికం కంపెనీలు ఏం కోరుకుంటున్నాయంటే...

టెలికం కంపెనీలు ఏం కోరుకుంటున్నాయంటే...

యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటాను తగ్గించాలని టెలికం కంపెనీలు కోరుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో స్పెక్ట్రం చెల్లింపులపై మార్చి 2022 వరకు అంటే రెండేళ్ల పాటు మారటోరియం ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలాగే లైసెన్స్ ఫీజు 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని కోరుతున్నాయి. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌ను 2 శాతానికి తగ్గించాలని అడుగుతున్నాయి.

ఉచిత కాల్స్ వద్దు.. చౌక డేటా ఆఫర్లకు నో!

ఉచిత కాల్స్ వద్దు.. చౌక డేటా ఆఫర్లకు నో!

కాగా, కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ టెలికం సంస్థల ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించనుంది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు ఇస్తోన్న ఉచిత ఆఫర్లను వెనక్కి తీసుకోవాలనే సూచనలు కమిటీ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. టెలికం కంపెనీల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్న ఉచిత మొబైల్ ఫోన్ కాల్స్, చౌక డాటా ఆఫర్లను ఆపేయాలని కేంద్రానికి కమిటీ నివేదిక ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

కనీస ఛార్జీలు నిర్ణయించే అవకాశం

కనీస ఛార్జీలు నిర్ణయించే అవకాశం

బెయిలవుట్ ప్యాకేజీ కింద టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సూచనలు చేయవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాయిస్ ఫోన్‌ కాల్స్, డాటా సర్వీసులకు కనీస చార్జీలను కూడా ట్రాయ్ ప్రకటించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అలా చేస్తే అన్ని కంపెనీలు వీటిని విధిగా పాటించాలి.

రిలయన్స్ జియో ఆరంగేట్రంతో...

రిలయన్స్ జియో ఆరంగేట్రంతో...

ఇటీవల రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీ (IUC)ల్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో టాప్అప్స్ తెరపైకి వచ్చాయి. దీనిపై కస్టమర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉచిత ఫోన్ కాల్స్, చౌక డేటా తగ్గింపు నిర్ణయాలు కస్టమర్లకు రుచించవని, వినియోగదారులపై భారం పడనుందని అంటున్నారు. ఎక్కువ ఇంటర్నెట్ వినియోగించే వారికి ఎక్కువ భారం కానుందని అంటున్నారు. రిలయన్స్ జియో ఆరంగేట్రం తర్వాత ఉచిత కాల్స్, చౌక డేటా ఆఫర్లతో పాటు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఇంటర్నెట్ లభిస్తోంది భారత్‌లోనే. మన దేశంలో ఒక GB డేటా ఖరీదు సగటున రూ.8గా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+