కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు, కంపెనీలకు భారీ ఊరట ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి నిలిచింది. డిమాండ్ పడిపోయింది. కంపెనీలు క్లోజ్ అయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు లేక సంస్థలు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 3 నెలల పాటు కంపెనీలకు చెందిన ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తామే చెల్లిస్తామని మార్చి నెలలో కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. లాక్ డౌన్ కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థ అప్పుడే కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో దీనిని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు చెప్పారు.
ఉద్యోగులకు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు నిర్మల తెలిపారు. మోడీ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు 72 లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ను చెల్లిస్తుంది. రూ.15వేల లోపు వేతనం కలిగిన వారికి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్లు గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే నెలల ఈపీఎఫ్‌ను చెల్లించింది. ఇప్పుడు మరో 3 నెలల పొడిగింపు వల్ల జూన్, జూలై, ఆగస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రయివేటు సెక్టార్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ మూడు నెలల పాటు ఈపీఎఫ్ మొత్తాన్ని 12 శాతం బదులు 10 శాతం చెల్లించే వెసులుబాటును కల్పించింది.

యజమానులు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వమే చేయడం వల్ల కంపెనీలు తమ వంతు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రయివేటు కంపెనీ యజమానుల చేతిలో లిక్విడిటీ ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే కేంద్రం చెల్లించే 12 శాతం కొనసాగుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications