వివాద్ సే విశ్వాస్ భారీ ఊరట, జూన్ 30 వరకు గడువు పొడిగింపు

ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకం వివాద్ సే విశ్వాస్‌ను మరో 2 నెలల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో జూన్ 30వ తేదీ వరకు ఊరటను కల్పించింది. ఈ పథకం కింద చివరిసారి గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది.

మదింపు నుండి తప్పించుకున్న ఆదాయం ఉంటే పన్ను అధికారులు అందుకు సంబంధించిన ఈక్విలైజేషన్ సుంకం ప్రక్రియ సమాచారాన్ని పంపించడానికి, మదింపును పునఃప్రారంభించే నోటీసుల జారీ చేయడానికి గడువును కూడా జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ ప్రారంభం వరకు వివాద్ సే విశ్వాస్ ద్వారా ఖజనాకు రూ.54,000 కోట్ల నిధులు వచ్చాయి.

Government extends deadline for making payment under Vivad Se Vishwas scheme till June 30

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇబ్బందులు ఉన్నాయని, కాబట్టి వివాద్ సే విశ్వాస్ గడువును పొడిగించాలని పరిశ్రమ నుండి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+