క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం తరఫున క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టే యోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్రిప్టో కరెన్సీపై ఎలాంటి నియంత్రణ లేదన్నారు. ఆర్బీఐ ఎలాంటి క్రిప్టో కరెన్సీలను జారీ చేయడం లేదన్నారు. ఆర్బీఐ చట్టం 1994 ప్రకారం సంప్రదాయ పేపర్ కరెన్సీని మాత్రమే కేంద్రబ్యాంకు జారీ చేస్తోందని తెలిపారు. ఈ పేపర్ కరెన్సీకే త్వరలో డిజిటల్ రూపమిస్తామన్నారు.
డిజిటల్ రూపంలో వచ్చే పేపర్ కరెన్సీకి సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీగా (CBDC) పేర్కొంటున్నట్లు తెలిపారు. ఈ CBDCని దశలవారీగా ప్రవేశపెట్టడానికి ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. పేపర్ కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించడం, తక్కువ ట్రాన్సాక్షన్ ఖర్చు, నోట్ల ముద్రణ ఖర్చు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.

కొంతకాలంగా నోట్ల ముద్రణ తగ్గిందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4378 కోట్లు విలువ చేసే నోట్లను ముద్రిస్తే ప్రస్తుతం రూ.4012 కోట్లకు తగ్గిందన్నారు. ఇదిలా ఉండగా, వివిధ క్రిప్టో కరెన్సీల వ్యాల్యూ క్షీణించింది.
గత ఇరవై నాలుగు గంటల్లో క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ అతిస్వల్పంగా 0.45 శాతం లాభపడి 38,852 డాలర్ల వద్ద, ఎక్స్‌ఆర్‌పీ 0.09 శాతం లాభపడి 0.761457 డాలర్ల వద్ద, అవాలాంచె 1.59 శాతం లాభపడి 67.75 డాలర్ల వద్ద, స్టెల్లార్ 1.21 శాతం లాభపడి 0.179 డాలర్ల వద్ద, పాలీగోన్ 0.42 శాతం లాభపడి 1.37 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే ఎథేరియం 1 శాతం నష్టపోయి 2540 డాలర్లు, టెర్రా 2 శాతం నష్టపోయి 90.72 డాలర్లు, సోలానా 0.38 శాతం నష్టపోయి 80.10 డాలర్లు, కార్డానో 0.73 శాతం క్షీణించి 0.789 డాలర్లు, డోజీకాయిన్ 1.65 శాతం క్షీణించి 0.111176 డాలర్లు, షిబా ఇను 0.96 శాతం తగ్గి 0.000021 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications