For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాకు ఆసక్తి లేదు.. మేం రేసులో లేం!: టిక్‌టాక్ కొనుగోలుపై సుందర్ పిచాయ్

|

చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు వివిధ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ దేశాలు టిక్‌టాక్ సహా చైనాకు చెందిన కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదా ఆ దిశగా అడుగులు వేస్తున్న దృష్ట్యా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ భారత్, అమెరికా సహా పలు దేశాల్లో వాటాల విక్రయానికి సిద్ధమైంది. టిక్‌టాక్‍‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్, రిలయన్స్, ట్విట్టర్ వంటి దిగ్గజాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్, నెట్‌ఫ్లిక్స్ ఈ రేసులో ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

బిజినెస్ కాదు, ప్రజల బాధ చూడండి: లోన్ మారటోరియంపై కేంద్రం మీద సుప్రీంకోర్టు ఆగ్రహంబిజినెస్ కాదు, ప్రజల బాధ చూడండి: లోన్ మారటోరియంపై కేంద్రం మీద సుప్రీంకోర్టు ఆగ్రహం

మేం రేసులో లేము

మేం రేసులో లేము

షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశ్యం గూగుల్‌కు లేదని సీఈవో సుందర్ పిచాయ్ తేల్చి చెప్పారు. అమెరికా కంపెనీలు కొనుగోలు చేయకుంటే దానిని క్లోజ్ చేసేందుకు ట్రంప్ పాలక వర్గం గడువు విధించింది. తాజాగా ఓ ఆన్‌లైన్ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే రేసులో గూగుల్ ఉందా అని ప్రశ్నించగా, 'మేం రేసులో లేము' అని స్పష్టం చేశారు పిచాయి. టిక్‌టాక్ తమ క్లౌడ్ సేవల్ని ఉపయోగించుకుంటోందని, అందుకు ఛార్జీలు చెల్లిస్తోందన్నారు. కానీ ఈ సంస్థను కొనుగోలు చేసే ఆలోచన లేదన్నారు. కాగా, అల్భాబెట్ గ్రూప్ బిడ్‌లో చేరుదామని తొలుత భావించినా, ఆ తర్వాత విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.

టెక్ కంపెనీల వృద్ధి

టెక్ కంపెనీల వృద్ధి

కరోనా మహమ్మారి కాలంలో ఇతర టెక్ కంపెనీల వలె టిక్‌టాక్ కూడా వృద్ధి సాధించిందని సుందర్ పిచాయ్ అన్నారు. ఇదే కాలంలో ఎగిసిపడిన సంస్థలు ఉన్నాయని, పెద్ద కంపెనీలు బాగా నడుస్తున్నాయని, వీటితో పాటు కొత్త కంపెనీలు కూడా దూసుకెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, తమ అమెరికా విభాగాన్ని కొనుగోలు చేయాలని టిక్‌టాక్ సంస్థ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తోను చర్చించిందని తెలుస్తోంది. అయితే కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

200 మిలియన్ డాలర్లతో క్రియేటర్స్ ఫండ్

200 మిలియన్ డాలర్లతో క్రియేటర్స్ ఫండ్

టిక్‌టాక్ వాటా విక్రయానికి తొలుత 45 రోజుల గడువు ఇచ్చింది ట్రంప్ పరిపాలనా వర్గం. ఆ తర్వాత ఆగస్ట్ 14వ తేదీన దీనిని 90 రోజులకు పొడిగించింది. నవంబర్ 12వ తేదీలోపు వాటాల విక్రయం పూర్తి కావాలి. ట్రంప్ కఠిన నిర్ణయాల నేపథ్యంలో రానున్న మూడేళ్లలో అమెరికాలో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని టిక్‌టాక్ తెలిపింది. అలాగే 200 మిలియన్ డాలర్లతో క్రియేటర్స్ ఫండ్‌ను ప్రారంభించింది.

English summary

మాకు ఆసక్తి లేదు.. మేం రేసులో లేం!: టిక్‌టాక్ కొనుగోలుపై సుందర్ పిచాయ్ | Google make it clear they are not buying TikTok

Alphabet and Google CEO Sundar Pichai has denied his company is in the race to acquire the Chinese short-video making app TikTok.
Story first published: Thursday, August 27, 2020, 16:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X