దేశంలో అత్యంత ఆకర్షణీయ ఉద్యోగ సంస్థ బ్రాండ్‌గా టెక్ దిగ్గజం సెర్చింజన్ గూగుల్ ఇండియా నిలిచింది. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా రెండో స్థానంలో నిలువగా, మైక్రోసాఫ్ట్ ఇండియా మూడో స్థానంలో ఉంది. ఫైనాన్షియల్ హెల్త్, బలమైన రెప్యుటేషన్, ఆకర్షణీయ వేతనం, ఇతర ప్రయోజనాలు సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకొని రాండ్‌స్టాడ్ సంస్థ సర్వే చేసింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2021 సర్వే పేరుతో వివరాలు వెల్లడించింది.

టాప్ 3 ఇవే
ఆర్థిక పరిపుష్ఠి, మంచి ప్రతిష్ఠ, ఆకర్షణీయమైన వేతనం సహా ఇతర ప్రయోజనాల ఆధారంగా టాప్ 3లో వరుసగా గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ నిలిచింది. 34 దేశాల్లో 6,493 సంస్థలపై 18 ఏళ్ల నుండి 65 సంవత్సరాల వయస్సు కలిగిన 1.9 లక్షల మంది నుండి ఈ అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ క్రమంలో భారత్‌లో ఎక్కువమంది గూగుల్‌లో పని చేసేందుకు ఆసక్తి కనబరిచారు.

4 భారత కంపెనీలు
టాప్ 10లో నాలుగు భారత సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఇన్ఫోసిస్ 4వ స్థానంలో, టాటా స్టీల్ 5వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత టీసీఎస్ 8వ స్థానంలో, విప్రో 10వ స్థానంలో ఉన్నాయి. టాప్ 10లోని ఇతర దేశ కంపెనీలు డెల్ టెక్నాలజీస్ 6వ స్థానంలో, ఐబీఎం 7వ స్థానంలో, సోనీ 10వ స్థానంలో ఉన్నాయి.

శాలరీ సహా వీటికి ప్రాధాన్యత
ఉద్యోగార్థుల ఆలోచనా ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చినట్లు ఈసారి సర్వేలో వెల్లడైంది. అటు ఉద్యోగ విధులు, ఇటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడైంది. శాలరీ ప్యాకేజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఉద్యోగ విధులు, కుటుంబ బాధ్యతలకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆకర్షణీయమైన జీతభత్యాలు (62 శాతం) ఉద్యోగం, కుటుంబం మధ్య సమతౌల్యం (65 శాతం) కోసం ఉద్యోగార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణ పని వాతావరణం(61 శాతం), ఉద్యోగ భద్రత (61 శాతం) అంశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications