Google India: అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ గతంలో తమ దేశంలో ముందుగా తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ లేఆఫ్ తర్వాత ఆసెగ ఇప్పుడు భారత గూగుల్ ఉద్యోగులనూ తాకింది.

లేఆఫ్ ప్రకటన..
కంపెనీ ఆర్థిక మూలాలను కాపాడే చర్యల్లో భాగంగా టెక్ దిగ్గజం గూగుల్ భారీ ఉద్యోగుల కోతలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ వేడి భారత వ్యాపారానికీ తాకిందని తెలుస్తోంది. గూగుల్ ఇండియా వివిధ విభాగాల్లో 453 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. తొలగింపుల ఈ-మెయిల్ గురువారం అర్థరాత్రి ఉద్యోగులకు పంపినట్లు తెలుస్తోంది.

సంజయ్ గుప్తా మెయిల్..
గూగుల్ ఇండియా కంట్రీ హెడ్ & వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తొలగింపబడిన ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ ప్రపంచవ్యాప్తంగా 6 శాతం ఉద్యోగులను అంటే 12,000 మందిని తొలగించనున్నట్లు గతనెలలో ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు ఇక్కడితో ఆగిపోతాయా లేక మళ్లీ తొలగింపులు ఉంటాయా అనే విషయాన్ని ఇంకా ధృవీకరించబడలేదు.

సుందర్ పిచాయ్..
తొలగించబడిన ఉద్యోగులకు మెయిల్‌లో సీఈవో సుందర్ పిచాయ్ నుంచి కొన్ని ఇన్‌పుట్‌లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కంపెనీ తొలగింపులకు దారితీసిన నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన అంగీకరించారు. జనవరిలో సుందర్ పిచాయ్ పంపిన నోట్‌లో అమెరికా బయట తొలగించబడిన గూగుల్ ఉద్యోగులకు స్థానిక పద్ధతులకు అనుగుణంగా మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.

టెక్ తొలగింపులు..
ప్రస్తుతం మాంద్యం వల్ల ఏర్పడిన ఆర్థిక ఆస్థిరతల కాలంలో కేవలం గూగుల్ ఒక్కటి మాత్రమే తన ఉద్యోగులను తొలగించలేదు. లేఆఫ్ లను ఆశ్రయించిన కంపెనీల జాబితాలో చాలా యూఎస్ కంపెనీలు ఉన్నాయి. అమెజాన్ తన వర్క్‌ఫోర్స్ నుంచి 18,000 మందిని తొలగించాలని యోచిస్తోంది. మెటా కూడా 13,000 మంది ఉద్యోగులను తొలగించింది. మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ కూడా తొలగింపులకు పూర్తి బాధ్యత వహించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications