చాలామంది యువకులు కోట్ల రూపాయలతో కూడిన ఉద్యోగం కావాలని కలలు కంటుంటారు. అయితే ఆ జాబ్ వచ్చాక దానిని వదిలేయడానికి ఎవరూ అంతగా ఇష్టపడరు. అయితే ఓ యువకుడు ఆ పని చేశాడు. 27 ఏళ్ల వయసులోనే చాలా మంది కలలు గనే ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త దారిని ఎంచుకున్నాడు. న్యూయార్క్‌లో గూగుల్‌లో పనిచేస్తూ ఏడాదికి 3 లక్షల డాలర్లు (దాదాపు రూ.2.52 కోట్లు) జీతం తీసుకుంటున్న జిమ్ టాంక్ అనే యువకుడు అకస్మాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతనికి జీవితంలో స్థిరమైన జీతం కంటే స్వేచ్ఛ, సంతృప్తి చాలా ముఖ్యమని భావించి ఉద్యోగాన్ని వదిలేశాడు.
2021లో ఆ యువకుడు గూగుల్‌లో చేరినప్పుడు తన తల్లిదండ్రులను తాను పనిచేస్తున్న ఆఫీసుకు తీసుకెళ్లి అమెరికన్ డ్రీమ్ ను సాధించానని తెలిపాడు. ఆసమయంలో మంచి జీతం, అద్భుతమైన సదుపాయాలు, తెలివైన సహచరులు ఇలా అన్నీ అతనికి లభించాయి. అయితే అవన్నీ లభించినా ఆ ఉద్యోగంలో లోతైన సంతృప్తి మాత్రం కనిపించలేదు. Google లో B2B ప్రకటన ఉత్పత్తులపై పనిచేసినా.. తన కృషి వల్ల కంపెనీకి మరింత డబ్బు సంపాదించడమే తప్ప, జీవితానికి అర్థం లేదనే భావనను ఏర్పరచుకున్నాడు.

జిమ్ ఒక దశలో FIRE (Financial Independence, Retire Early) ఉద్యమాన్ని అనుసరించాడు.5 మిలియన్ డాలర్లు ఆదా చేసి, 40 ఏళ్ల లోపు రిటైర్ అవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం పదోన్నతులు, సిలికాన్ వ్యాలీ జీవనశైలి, అన్ని అవకాశాలను వినియోగించుకున్నాడు. అయితే కార్పొరేట్ జీవితంలో రొటీన్, వ్యక్తిగత జీవితంలో వచ్చిన బ్రేకప్, ఆఫీసు ఒత్తిడులు అన్నీ కలిపి అతనిలో అసంతృప్తిని మరింతగా పెంచాయి. దీంతో అతను కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
అతను ఎన్నో నెలల పాటు ఈ అసంతృప్తిలో నలిగిపోయాక ఉద్యోగాన్ని వదిలేయడమే బెటన్ అనే నిర్ణయానికి వచ్చాడు. అనేక ఆలోచనల అనంతరం, 2025 మేలో గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సురక్షితమైన జీతం, విలాసవంతమైన జీవితం వదిలి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.
జిమ్ ఇప్పుడు టోక్యోతో మొదలు పెట్టి ఆసియా అంతటా ప్రయాణం చేస్తున్నాడు. ఒక డిజిటల్ నోమాడ్ (ఇంటర్నెట్, ల్యాప్‌టాప్, మొబైల్ సహాయంతో ఎక్కడ ఉన్నా పని చేస్తూ, ప్రయాణిస్తూ స్వేచ్ఛగా జీవించే వ్యక్తి) గా సృష్టికర్త, కోచ్, స్టార్టప్ వ్యవస్థాపకుడిగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. డిజిటల్ ఉత్పత్తులు నిర్మించడం, కోచింగ్ ఇవ్వడం, తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడం .. ఇవన్నీ అతని కొత్త జీవనశైలిలో భాగంగా ఉన్నాయి.
అతని ఆదాయం ఇప్పుడు స్థిరంగా లేకపోయినా, గూగుల్‌లో పని చేసినప్పుడు సంపాదించిన ఆర్థిక భద్రత అతనికి ధైర్యం ఇస్తోంది. జీతం, సౌకర్యాలు మాత్రమే జీవితాన్ని ఆనందంగా ఉంచవని అతని జీవిత పాఠం మనకు నేర్పుతోంది. నిజమైన విజయం అంటే మనసు కోరిన మార్గంలో సంతృప్తి కలిగేలా జీవించాలని చెబుతోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications