Income Tax Cut: మోదీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే ఈ సారి ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్ పైనే అందరి చూపు ఉంది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద టాక్స్ తగ్గింపు బహుమతిని అందించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు 2020 వార్షిక బడ్జెట్లో న్యూ టాక్స్ రీజిమ్ పన్ను రేట్లను తగ్గించటంతో పాటు రూ.7 లక్షల వరకు పన్ను రహితంగా మార్చుతూ ఎన్డీఏ సర్కార్ ప్రకటించింది.
ప్రస్తుతం ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించిన పలు కథనాల సారాంశం ప్రకారం ఈ సారి కేంద్రం పన్ను భారాన్ని తగ్గించేందుకు పెద్ద ప్రకటన 2024 బడ్జెట్లో ఉంచుతుందని తెలుస్తోంది. అయితే దీనికింద ప్రయోజనం ఎవరికి ఉంటుంది, ఎంత మేర ఉంటుందనే చuiర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం దేశంలో వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం పన్ను భారాన్ని తగ్గించాలని చూస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో రూ.15 లక్షల వార్షిక ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారులకు దీనివల్ల అధికంగా ప్రయోజనం కలగనుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న పన్ను రేటు తగ్గింపు 2020లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త టాక్స్ రీజిమ్‌లో ఉండనున్నట్లు సమాచారం. దీనికింద రూ.15 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులు 5-20 శాతం రేటు వద్ద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.15 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులు 30 శాతం టాక్స్ బ్రాకెట్ కిందకు రానున్నారు. ఆదాయపు పన్నులో కోత వినియోగదారుల చేతుల్లో అదనపు నగదు కారణంగా వినియోగం పెరుగుతుంది. కొన్ని వర్గాలకు పన్నులను తగ్గించడం వల్ల మధ్యతరగతి వారికి కూడా పొదుపు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
ద్రవ్యోల్బణం అధిక స్థాయిలను పరిగణనలోకి తీసుకుని, 2024-25 కోసం రాబోయే పూర్తి బడ్జెట్‌లో అత్యల్ప శ్లాబ్‌లో ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను మినహాయింపును పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని కొత్తగా ఎన్నికైన CII ప్రెసిడెంట్ సంజీవ్ పూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్ పన్ను రేట్లు లేదా స్లాబ్‌లలో ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. అయితే ఎన్నికలు పూర్తైన తర్వాత దేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఊహాగానాలు విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications