Tech Jobs: చాలా నెలలుగా దేశీయ టెక్ కంపెనీల్లో అత్యంత గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ రంగంలో పనిచేస్తున్న లక్షల మంది టెక్కీలు లేఆఫ్స్‌తో పాటు నిలిచిపోయిన రిక్రూట్మెంట్లతో సతమతమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా కంపెనీలు వేతన పెంపులను సైతం నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ కంపెనీలైన ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ట్విట్టర్ సహా అనేక దిగ్గజాలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో భారతీయ టెక్ కంపెనీలు మాత్రం ఉద్యోగుల సంఖ్యను తగ్గించటానికి బదులుగా.. కొత్త నియామకాలను నిలిపివేశాయి. దీంతో టాప్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాల్లో వేల సంఖ్యలో ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లు త్రైమాసిక గణాంకాలు వెల్లడించాయి.

అయితే ప్రస్తుతం ఈ పరిస్థితులు మెల్లగా చక్కబడుతున్నాయి. చాలా కాలం విరామం తర్వాత తాజాగా క్యూ4 టీసీఎస్ ఫలితాలను గమనిస్తే కంపెనీ కొత్తగా 10,000 మంది టెక్ ఫ్రెషర్లను టాప్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి రిక్రూట్ చేసుకున్నట్లు ప్రకటించింది. దీనికి తోడు టెక్ కంపెనీల్లో లీడర్‌షిప్ హైరింగ్ ఆశలు చిగురింపజేస్తోంది. ఎగ్జిక్యూటివ్ సెర్చ్ అండ్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ ఫర్మ్స్ ప్రకారం.. ఐటీ సంస్థలు లీడర్‌షిప్, సీనియర్ లెవెల్స్ సహా కొత్త రోల్స్ కోసం ఉద్యోగుల్ని నియమించుకునే పనిలో పడ్డాయని వెల్లడైంది.
అయితే ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం గ్రాడ్యుయేట్లకు, ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తూ మరో కంపెనీకి మారాలనుకుంటున్న టెక్కీలకు పెద్ద ఊరటను అందిస్తున్నాయి. భారత్. యూఎస్, యూకేలో ఎన్నికల హడావిడి తర్వాత టెక్ ఓపెనింగ్స్ పెరిగి హైరింగ్ వేగం పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో చాలా మందిని ఏఐ భయాలు సైతం వెంటాడుతూనే ఉన్నాయి.
ఇదే క్రమంలో చాలా కంపెనీలు తమ ఏఐ ఆధారిత ఉత్పత్తులను మార్కెట్లో కస్టమర్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల ఈ స్కిల్స్ ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం రానున్న త్రైమాసికాల్లో ఐటీ కంపెనీల వ్యాపారాలు గాడినపడనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టెక్ కంపెనీల్లో మెుదలైన నియామకాల ప్రక్రియ కూడా దీనినే సూచిస్తున్నట్లు వాళ్లు చెబుతున్నారు. గడ్డు కాలంలో సైతం టెక్ దిగ్గజం టీసీఎస్ డబుల్ డిజిట్ గ్రోత్ తో స్టాక్ మార్కెట్లలోని తన పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

ఒకే కంపెనీలో 10 ఏళ్లు ఉండాలా? లేక పదేళ్లలో 10 ఉద్యోగాలు మారాలా? ఏది బెస్ట్?

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications