పసిడి ప్రియులకు శుభవార్త: వరుసగా నాలుగోరోజు బంగారం ధరల క్షీణత; నేడు ధరలిలా!!
గత కొద్ది రోజులుగా బెంబేలెత్తించిన బంగారం ధరలు మళ్లీ నాలుగు రోజులుగా తగ్గు ముఖం పడుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వరుసగా నాలుగవ రోజు బంగారం ధరలు తగ్గడం పసిడి ప్రియులకు శుభవార్త అని చెప్పాలి. అయితే బంగారం ధరలలో హెచ్చుతగ్గులు మరికొంతకాలం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు.
నేడు బంగారం ధరలు ఎంతగా తగ్గాయంటే; హైదరాబాద్ లోనూ ధరల తగ్గుదల
ఇక తాజాగా దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే నిన్నటికి ఈరోజుకి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 210 రూపాయలు తగ్గి 54,500 వద్ద ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటికి ఈరోజుకి 240 రూపాయలు తగ్గి, 59,450 వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర 54,500గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం హైదరాబాద్లో 59,450 వద్ద ట్రేడ్ అవుతుంది .

ఢిల్లీ, ముంబై, కలకత్తాలలో బంగారం ధరలిలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,650 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 59,600గా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,500గా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,450గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కలకత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,500 ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,450 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
బెంగళూరు, ఏపీలో బంగారం ధరలు ఇలా
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,550 గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,500గా ట్రేడ్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి, కడపలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,500గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,450గా ట్రేడ్ అవుతుంది. ఇక దేశంలోని అనేక రాష్ట్రాలలో బంగారం ధరలు ఆయా రాష్ట్రాల స్థానిక పన్నులను బట్టి మారుతూ ఉంటాయి.


Click it and Unblock the Notifications