RCom Shares: దశాబ్ధానికి పైగా కనుమరుగైన అనిల్ అంబానీ పేరు తిరిగి మార్కెట్లో ప్రస్తుతం వినిపిస్తోంది. అయితే ఈసారి ఆయన పునరాగమనంతో పాటు ఆయనకు అనుకూలంగా వస్తున్న వార్తలు తిరిగి వ్యాపారవేత్తగా ఆయన జర్నీ 2.0 విజయవంతంగా ముందుకు సాగుతున్నట్లు నిరూపిస్తోంది. అనేక కంపెనీల రుణాలను తిరిగి చెల్లించటంతో ప్రస్తుతం అనిల్ వ్యాపారాలు తిరిగి గాడిన పడుతున్నాయి.
గడచిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్టాక్ మార్కెట్ల పనితీరుతో సంబంధం లేకుండా పెరుగుదలను నమోదు చేసింది. అయితే సోమవారం మార్కెట్లో ఆర్ కామ్ కంపెనీ షేర్లు ఫోకస్‌లో కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం అనిల్ అంబానీకి బాంబే హైకోర్టు ఉపశమనం ఇవ్వటమే. ఈ క్రమంలో అంబానీ రుణ ఖాతాను మోసంగా వర్గీకరించే కెనరా బ్యాంక్ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు స్టే విధించింది.

కెనరా బ్యాంక్ నవంబర్ 8, 2024 నాటి ఉత్తర్వులకు వ్యతిరేకిస్తూ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ న్యాయమూర్తులు రేవతి మోహితే-దేరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. తన రుణ ఖాతాను మోసపూరితంగా ప్రకటించే ముందు కెనరా బ్యాంక్ తన మాట వినలేదని అంబానీ కోర్టులో సవాలు చేయటంతో ప్రస్తుత చర్యలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో కోర్టు రిజర్వు బ్యాంక్ నుంచి సమాధానం కోరింది.
బ్యాంకులపై ఆర్‌బీఐ కొంత చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం కామెంట్ చేసింది. ప్రజలు ప్రతిసారి ఇలాంటి సమస్యలతో కోర్టును ఆశ్రయిచంటపై రిజర్వు బ్యాంకును ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో అనిల్ అంబానీ వరుసగా తనకు చెందిన అనేక కంపెనీల రుణాలను సెటిల్ చేసుకుంటూ కంపెనీలను రుణ విముక్తి చేస్తున్నారు. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్లు 4.65 శాతం పెరిగి రూ.1.80 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2.59 వద్ద ఉంది. వాస్తవానికి 2008 సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.800 వద్ద ట్రేడింగ్ కొనసాగిన సంగతి తెలసిందే. ప్రస్తుతం ఈ పెన్నీ స్టాక్ కొనుగోలు చేసేందుకు మార్కెట్లో తీవ్ర పోటీ కొనసాగుతోంది.
బ్యాంక్ ఏం చేసింది..?
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ రుణ ఖాతాను "మోసం"గా ప్రకటించాలని కెనరా బ్యాంక్ నోటీసు జారీ చేసింది. అంబానీ కంపెనీ తీసుకున్న రుణాలను భారీగా దుర్వినియోగం చేసిందని బ్యాంక్ అందులో పేర్కొంది. అనిల్ అంబానీ ఆర్ కామ్ కంపెనీకి క్రెడిట్ సౌకర్యాలుగా మంజూరు చేయబడిన రూ.1,050 కోట్ల రుణాలను ఉపయోగించడంలో సమస్యలను తాజా నోటీసులో బ్యాంక్ ప్రస్థావించింది. టర్మ్ లోన్‌లు, గ్యారెంటీలు, క్రెడిట్ లెటర్‌లను కలిగి ఉన్న రుణాలను RCOM తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయి, మంజూరు నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మార్చి 9, 2017న నిరర్థక ఆస్తులుగా వర్గీకరించబడ్డాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications