TCS News: టెక్ ఫ్రెషర్లకు టీసీఎస్ శుభవార్త.. మంచి కాలం మెుదలైందిగా..!!

IT News: దేశంలోని యువతలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగాల కోసం చాలా కాలంగా టెక్ జాబ్స్ ఓపెనింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులతో టెక్ కంపెనీల వ్యాపారాలు దిగజారిన సంగతి తెలిసిందే.

భారతదేశపు అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) దాని తాజా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకోవటం పెద్ద శుభవార్తగా చెప్పుకోవాలి. ఐటీ రంగంలో బలహీనమైన డిమాండ్ కారణంగా చాలా పెద్ద ఐటీ కంపెనీల నుంచి నియామకాలు తగ్గుతున్నట్లు కళాశాలలు చెబుతున్నాయి. ఇది విద్యార్థులకు పెద్ద షాక్ ఇస్తోంది. ఇలాంటి తరుణంలో గత నెలలో టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్(NQT) ద్వారా తాజా నియామకాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. TCS, టైటాన్ వంటి టాటా గ్రూప్ కంపెనీలు కాకుండా.. హ్యాపీయెస్ట్ మైండ్స్ వంటి సంస్థలు నియామకం కోసం NQTని ఉపయోగిస్తాయి.

Good News Tech jaint TCS hires 10000 IT freshers from major engineering colleges across company

ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న టీసీఎస్.. నింజా, డిజిటల్ అండ్ ప్రైమ్ అనే మూడు కేటగిరీల కోసం నియామకం చేస్తోంది. నింజా కేటగిరీ కింద వివిధ పాత్రల కోసం సంవత్సరానికి రూ.3.36 లక్షల ప్యాకేజీని అందిస్తోంది. అయితే డిజిటల్ కేటగిరీ కింద రూ.7 లక్షలు ఆఫర్ చేస్తుండగా.. ప్రైమ్ కేటగిరీ కింద రూ.9-11.5 లక్షల వార్షిక ప్యాకేజీ కింద అందిస్తోంది.

ఇటీవలి కాలంలో టీసీఎస్ దాదాపుగా 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవటం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు మొత్తం 963 ఆఫర్ లెటర్లు వచ్చాయని, అందులో 103 ప్రైమ్ కేటగిరీకి చెందినవేనని కెరియర్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. కళాశాలలో 1,300 మంది విద్యార్థులకు 2,000 ఆఫర్ లెటర్లను అందజేసినట్లు శాస్త్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్ వైద్యసుబ్రమణ్యం తెలిపారు. ఇదే క్రమంలో SRM కళాశాలలోని విద్యార్థులు భారీగా టీసీఎస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ఉద్యోగాలను పొందారు.

దేశంలోని టెక్ కంపెనీలు ఈ ఏడాది టాప్ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి విద్యార్థులను క్యాంపస్ డ్రైవ్స్ ద్వారా నియమించుకునేందుకు దూరంగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో జాబ్ మార్కెట్లోకి టీసీఎస్ నియామకాల కోసం లేటుగా ఎంట్రీ ఇచ్చినట్లు టాప్ ఇంజనీరింగ్ కాళాశాలల్లోని ప్లేస్‌మెంట్ అధికారులు తెలిపారు. దేశంలోని ఐఐటీ, ఐఐఎంలలోని ఉద్యోగార్థులు సైతం ఆఫర్లు లేక ఆందోళన చెందుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+