మీరు ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేస్తుంటార.. అయితే ఈ వార్త మీకు ఉపయోగపడొచ్చు. కేంద్ర బడ్జెట్ 2025లో చేసిన మార్పుల తర్వాత కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఆదాయపు పన్ను అప్ డేట్ రిటర్న్ (ITR-U) ఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫామ్ ఏప్రిల్ 2025 నుండి అందుబాటులో ఉండగా, పాత పన్ను ఫైల్ చేసాక ఏవైనా తప్పులు సరిదిద్దడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పిస్తుంది. ఈ రూల్స్ పన్ను నియమాలను పాటించడాన్ని సులభం చేయడంలో ఇంకా తప్పులను సరిదిద్దడంలో సహాయపడుతుంది. కానీ ఈ ఫార్మ్ పన్ను తగ్గించడానికి లేదా రిటర్న్ ఫైల్ చేయడానికి ఉపయోగించలేరు.

కొత్త నిబంధనల ప్రకారం, పన్ను చెల్లింపుదారులకు తప్పులను సరిదిద్దుకోవడానికి 48 నెలలు (4 సంవత్సరాలు) సమయం ఇస్తుంది. గతంలో ఈ కాల వ్యవధి 24 నెలలు మాత్రమే. అంటే ఇప్పుడు ఈ కాలపరిమితి రెట్టింపు అయింది. ఉదాహరణకు మీరు 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్ ఫైల్ చేస్తే అసెస్‌మెంట్ సంవత్సరం 2025-26 అయితే మీరు 31 మార్చి 2030 వరకు ITR-U ఫామ్‌ను ఫైల్ చేయవచ్చు.
ఐటీఆర్-యు ఎవరు ఫైల్ చేయవచ్చు: ITR-U ఫార్మ్ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయలేకపోయిన వారి కోసం లేదా ఆదాయం గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన లేదా తప్పుగా ఆదాయ రకాన్ని సెలెక్ట్ చేసుకున్న వారి కోసం. ఈ ఫార్మ్ పన్ను చెల్లింపుదారులకు తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కానీ గతంలో పేర్కొన్న ఆదాయాన్ని తగ్గించడానికి లేదా రిటర్న్ కోరడానికి కాదు. ఇంకా ఆదాయం గురించి సమాచారాన్ని అందించడానికి లేదా తప్పులను సరిదిద్దడానికి మాత్రమే.
ఐటీఆర్-యు ఎలా ఫైల్ చేయాలి: కొత్త నిబంధనల ప్రకారం, అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన తర్వాత మాత్రమే ITR-U ఫామ్‌ను ఫైల్ చేయవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ తేదీని తప్పితే డిసెంబర్ 31 వరకు లెట్ రిటర్నును ఫైల్ చేయవచ్చు. దీని తరువాత ITR-U ఫామ్ మాత్రమే మిగిలి ఉన్న ఏకైక అప్షన్. ఉదాహరణకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌ను 31 జూలై 2025 లోపు ఫైల్ చేయాలి. ఒకవేళ ఈ తేదీలోపు మిస్ అయితే ITR-Uని 31 డిసెంబర్ 2025 వరకు ఫైల్ చేయవచ్చు, ఇది కూడా మిస్ చేస్తే 1 ఏప్రిల్ 2026 వరకు ఫైల్ చేయవచ్చు. ఫామ్‌ను ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు డ్రాప్-డౌన్ మెను నుండి వ్యవధిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రిటర్న్ వెరిఫై చేయాల్సి ఉంటుంది.
భారీ జరిమానాలు: ITR-U ని ఫైల్ టైంలోగ చేయనందుకు జరిమానా ఉంటుంది, ఇంకా రిటర్న్ ఎంత త్వరగా ఫైల్ చేసారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మొదటి సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 25% పన్ను ఇంకా వడ్డీ ఉంటుంది. మీరు రెండవ సంవత్సరంలో ఫైల్ చేస్తే 50% అదనపు పన్ను ఇంకా వడ్డీ వసూలు చేస్తారు. మూడవ సంవత్సరంలో 60% పన్ను అలాగే వడ్డీ పెరుగుతుంది. అదేవిధంగా నాల్గవ సంవత్సరంలో 70% అదనపు పన్ను ఇంకా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ జరిమానాలు పన్ను చెల్లింపుదారులు తప్పులను త్వరగా సరిచేసుకునేలా ప్రోత్సహిస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications