Investment Idea: ఆ రంగంపై టాక్స్ తగ్గింపులు.. కేంద్రం నిర్ణయంతో పెరిగే స్టాక్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..
Investment Idea: ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 12%-15%, ఇథనాల్ కలిపిన డీజిల్‌పై 20% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఇంధన ధరలను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. డీజిల్ అండ్ పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఛార్జీలను మరింత తగ్గించింది. అంతేకాకుండా.. 2022 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 01, 2022 నుంచి అన్‌బ్లెండెడ్ ఇంధనం రూ. 2/లీటర్‌కు అదనపు ఎక్సైజ్ ఛార్జీని వసూలు చేయనుంది.

టాక్స్ ఆదా.. రైతులకు ఉపయోగం..
మీరు లీటర్ పెట్రోల్‌ను కొనుగోలు చేసినట్లయితే.. అందులో 15% ఇథనాల్‌ను కలిపి ఉంటే, అప్పుడు కేవలం 85% పెట్రోల్‌పై ఎక్సైజ్ టాక్స్ విధించబడుతుంది. మిగిలిన 15% ఇథనాల్ పై కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను మాత్రమే ఉంటుంది. దీనివల్ల దిగుమతి సుంకాలు, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం ఇథనాల్-బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తోంది. రెండవది.. ఇథనాల్-బ్లెండింగ్ ప్రమోషన్ దేశీయ చెరకు రైతులకు ఖర్చు తగ్గింపును అందించనుంది.

క్లీన్ ఎనర్జీ ప్రమోట్ చేయటానికి..
క్లీనర్ ఇంధన వినియోగాన్ని వేగవంతం చేయడానికి అక్టోబర్ 1 నుంచి రూ.2 గ్రీన్ టాక్స్ తొలగిస్తున్నందున పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా తగ్గుతాయి. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తాజా చర్య చివరికి వినియోగదారులకు ఉపశమనం కలిగించనుంది.

ఏఏ స్టాక్స్ లాభపడతాయి..
చక్కెర, చమురు వ్యాపారాల్లో ఉన్న దేశీయ కంపెనీలపై రానున్న రోజుల్లో పన్ను భారం తగ్గనుంది. ఈ కారణంగా ఆ కంపెనీల లాభాలు భారీగా పెరగవచ్చు. ఆ రంగాలకు చెందిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి క్యాపిటల్ అప్రీసియేషన్ తో పాటు, మంచి డివిడెండ్ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా.. IOC, BPCL, HPCL వంటి చమురు కంపెనీలతో పాటు, చక్కెర వ్యాపారాల్లో ఉన్న బలరాంపూర్ చినీ, కేసీపీ షుగర్స్, శ్రీ రేణుగా షుగర్స్, దంపూర్ షుగర్స్, దాల్మియా షుగర్స్ వంటి అనేక స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ఇది నిజంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు.