బంగారం ప్రియులకు శుభవార్త. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో వరుసగా పడిపోతున్న బంగారం ధరలు బంగారం కొనుగోలుదారులకు బంగారాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చేలా చేస్తున్నాయి. ఓ దశలో రెండేళ్ల గరిష్టానికి చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ధరల తగ్గుదల కొనసాగుతుందా? మళ్ళీ మారుతుందా అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కాని ప్రశ్నే..

నెల రోజుల కనిష్టానికి చేరిన బంగారం ధరలు
ప్రస్తుతం నెలరోజులు కనిష్టానికి బంగారం ధరలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బంగారం ధరలు మరింత తగ్గితే బాగుండని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

హైదరాబాద్, ఢిల్లీలలో బంగారం ధరలు ఇలా
ఇక తాజాగా బంగారం ధరల విషయానికొస్తే దేశీయంగా బంగారం ధరలలో తగ్గుదల కనిపిస్తుంది. నేడు దేశంలోని వివిధ ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,700గా ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,510 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
నిన్నటికి ఈరోజుకి వంద రూపాయలు మేర బంగారం ధరలు తగ్గిన పరిస్థితి ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,950గా ప్రస్తుతం కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 56,610 గా ట్రేడ్ అవుతోంది.

విశాఖ, విజయవాడ, బెంగుళూరులలో బంగారం ధరలు నేడు ఇలా
ఇక బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 51,850 ప్రస్తుతం ధర పలుకుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 56,560 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బంగారం ధరల విషయానికి వస్తే నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో 51,700గా ట్రేడ్ అవుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విజయవాడలో 56,510 రూపాయల వద్ద కొనసాగుతుంది.
ఇక విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,700 ఉంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 56,510గా కొనసాగుతుంది.

ముంబై, చెన్నై లలో బంగారం ధరలిలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,700గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా కొనసాగుతుంది.ఇక దేశంలోనే బంగారం ధరలలో అత్యధిక ధరలను నమోదు చేసే తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, మధురై, కోయంబత్తూర్ లలో బంగారం ధరలు నేడు చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,350 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,150 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది .
మొత్తంగా చూస్తే ప్రస్తుతం బంగారం ధరలు కిందికి చూస్తున్న పరిస్థితి పసిడి ప్రియులకు శుభవార్త అని చెప్పాలి. మరెందుకాలస్యం బంగారం కొనుగోలు చెయ్యాలి అని అని భావించేవారు ఇదే సరైన సమయం అని నిపుణులు సూచిస్తున్న క్రమంలో బంగారం షాపులకు వెళ్లి నచ్చిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోండి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications