మేడే రోజు పసిడిప్రియులకు శుభవార్త.. తెలుగురాష్ట్రాల్లో తగ్గిన తాజా బంగారం ధరలివే!!
మేడే రోజు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. బంగారం ధర నెల ఆరంభంలోనే తగ్గడం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధరలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల ప్రభావం బంగారం ధరలపై పడుతుంది.
నేడు బంగారం ధరలు బాగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 150 రూపాయలు తగ్గి 55,700 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయలు తగ్గి 60,760 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాదులో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,760 రూపాయల వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలు కాగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,910 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,760 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 750 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,810 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,760 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచ్చి, తిరునవ్వేలి, తిరుపూర్, సేలం ,ఈరోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,300 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,420 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications