అక్షయ తృతీయ నాడు పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు; నేడు ధరలిలా!!
అక్షయ తృతీయ రోజు బంగారం ప్రియులకు సంతోషం కలిగించే వార్త ఇది. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయాలని భావించే వారికి నేడు కాస్త బంగారం ధరలు తగ్గడం ఉపశమనాన్ని ఇచ్చింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ బంగారం ధరలు దూసుకుపోతున్నాయి.
ప్రస్తుతం 60 వేలను దాటి కొనసాగుతున్న బంగారం ధరలు ముందు ముందు 70 వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి అక్షయ తృతీయ కు బంగారం కొనుగోలు చేయలేమని పెరిగిన ధరలను చూసి చాలామంది బాధ పడ్డారు. అయితే ఈ రోజు కాస్త తగ్గిన బంగారం ధరలు బంగారం ప్రియులకు సంతోషాన్ని కలిగించాయి.

దేశంలో ఈరోజు తగ్గిన బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 300రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 330రూపాయల మేర ధర తగ్గింది. హైదరాబాదులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,750 రూపాయలుగా ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,820 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 55,900 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,970 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,750 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,820 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.

బెంగళూర్ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలు కాగా 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయలు గా ట్రేడవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,750 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,820 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూర్, సేలం, ఈ రోడ్, తిరుపూర్, తిరుచ్చి, తిరునవ్వేలిలలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,050 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,150 రూపాయల వద్ద ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications