తాజాగా బంగారం ధరలలో భారీగా తగ్గుదల నమోదు కావడం గోల్డ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్తగా మారింది.
గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు హోలీ పండుగ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాస్త కిందికి దిగటం పసిడి ప్రియులకు శుభవార్త అని చెప్పాలి. ఇక దానికి కొనసాగింపుగా నేడు కూడా ధరలు బాగా తగ్గాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు కొద్దిగా తగ్గినా అది బంగారం ప్రియులకు శుభవార్తగానే మారుతుంది. అయితే తాజాగా బంగారం ధరలలో భారీగా తగ్గుదల నమోదు కావడం గోల్డ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్తగా మారింది.

బాగా పెరిగిన బంగారం ధరలు.. మళ్ళీ ఇప్పుడు క్రిందికి
భారతదేశంలో ముఖ్యంగా ప్రజలంతా బంగారాన్ని అమితంగా ఇష్టపడతారు. ఎవరికి ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా, ఇళ్లలో శుభకార్యాలు జరుపుకోవాలన్నాబంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.ఇక అందాన్ని ఇనుమడింపజేసే అలంకరణ గానే కాకుండా బంగారాన్ని ఆర్థిక అవసరాల కోసం ఉపయోగపడుతుందని కొనుగోలు చేసే వారు కూడా లేకపోలేదు.2022 చివర్లో,అలాగే 2023 ప్రారంభం నుండి బంగారం ధరల మోత మోగింది.విపరీతంగా ధరలు పెరిగి రెండేళ్ల గరిష్టానికి బంగారం ధరలు చేరిన పరిస్థితి ఉంది.అయితే మళ్లీ ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

ఒక్క రోజులో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
అయితే తగ్గుదల తక్కువగాను,బంగారం ధరల పెరుగుదల ఎక్కువగాను కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ తాజాగా అంతర్జాతీయంగా బలహీన సంకేతాలను నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఒక్కరోజులో బాగా పడిపోయాయి. బంగారం ధర ఒక్కరోజులోనే ఏకంగా 720 రూపాయల వరకు తగ్గింది. ఇక రికార్డు స్థాయిలో వెండి ధరలోనూ పతనం కనిపించింది. వెండి ధరలో 2500 రూపాయల పతనం నమోదు అయ్యింది.

తాజాగా హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా
తాజాగా హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 50వేల 900 రూపాయలుగా కొనసాగుతుంది. సోమవారం నాడు బంగారం ధర హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారానికి 51,850 రూపాయలు ఉండగా కచ్చితంగా మూడు రోజులకి 50 వేల 900 రూపాయలకు చేరడం భారీ తగ్గుదలగా చెప్పొచ్చు. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో చూసినట్లయితే ప్రస్తుతం 55,530 రూపాయల వద్ద కొనసాగుతుంది. సోమవారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,550 రూపాయల వద్ద కొనసాగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధరలలోను మొన్నటికి ఈరోజుకి వెయ్యి రూపాయలకు పైగా తగ్గుదల నమోదయింది.

ఢిల్లీ, ముంబై, విశాఖ, విజయవాడలలో బంగారం ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,050 రూపాయలు ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 55,680 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50,900 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 55,530 కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖపట్నంలో 50,900 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖపట్నంలలో 55,530 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక బంగారం ధరలలో వివిధ నగరాలలో చిన్న చిన్న మార్పులు స్థానికంగా ఉండే పన్నుల ఆధారంగా ఉంటాయి.
More From GoodReturns

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..



Click it and Unblock the Notifications