Bank Job: నేటి కాలంలో అన్నీ అధునికమైపోతున్నాయి. మన గురించి మనం చెప్పుకోకపోయినా.. చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి పెద్ద సమస్యే వచ్చి పడింది.
నేటి కాలంలో ఇల్లు కట్టుకోవాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా తప్పక అప్పు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి సరసమైన వడ్డీకి రుణాలను పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పక అవసరం. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం పొందాలన్నా అందుకు CIBIL తప్పనిసరి అయ్యింది. IBPS తన ఇటీవలి నోటిఫికేషన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు మంచి క్రెడిట్ చరిత్రను కలిగి ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. SBI మినహా ఇతర బ్యాంకులు మంచి సిబిల్ అర్హతగా పెట్టాయి. అందుకోసం 650 పాయింట్లకు పైగా మీ స్కోర్ తప్పనిసరి.

సివిల్ స్కోర్ 650 కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ నిర్థేశించిన దాని కంటే తక్కువగా ఉన్నట్లయితే దరఖాస్తుదారు తన బ్యాంక్ నుంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆఫర్ లెటర్ రద్దు చేసే ప్రమాదం ఉంది. సిబిల్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్థిక చరిత్ర గురించి వెల్లడిస్తుంది. ఎంత తరచుగా లోన్స్ తీసుకుంటున్నారు, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు, సమయానికి లోన్స్ చెల్లిస్తున్నారా లేదా అనే వివరాలు దాని ద్వారా తెలుసుకోవచ్చు.
లోన్ ఆమోదం పొందాలంటే ముందుగా క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ను బ్యాంకులు పరిశీలిస్తాయి. దరఖాస్తు దారు సకాలంలో రుణాలను చెల్లించాడా లేదా అనే మెుత్తం సమాచారాన్ని బ్యాంకులు దాని నుంచి గ్రహిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బ్యాంకులకు రుణాలు ఇచ్చే ముందు CIBIL నిర్ధారణ తప్పనిసరిగా చేయాలని బ్యాంకులకు సూచించింది. ఇది రుణ డిఫాల్ట్ అవకాశాలను తగ్గిస్తుంది. సిబిల్ 750 కంటే ఎక్కువ ఉన్నట్లయితే తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందడంలో సహాయపడుతుంది. సకాలంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు, వినియోగం కూడా సిబిల్ స్కోర్ ను ప్రభావితం చేస్తుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications