యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్ భారత వృద్ధి రేటును భారీగా తగ్గించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతంగా ఉండవచ్చునని గతంలో అంచనా వేసింది. ఇప్పుడు దీనిని సగానికి పైగా తగ్గించి 1.6 శాతానికి కుదించింది. ఒక నెల రోజుల్లోనే వృద్ధి రేటు అంచనాలను కుదించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అయితే ఆ తర్వాత సంవత్సరం మాత్రం మంచి వృద్ధి రేటు కనబరుస్తుందని పేర్కొంది.
1970, 1980, 2009 ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరింత దారుణంగా ఉంటుందని తెలిపింది. ఇతర రేటింగ్ సంస్థలు కూడా భారత వృద్ధి రేటుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఫిచ్ రేటింగ్స్, ఇక్రాలిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2 శాతంగా ఉంటుందని అంచనా వేశాయి. ఎస్ అండ్ పీ 3.5 శాతం, మూడీస్ 2.5 శాతంగా అంచనా వేశాయి.

తొలుత మందగమనం, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో డొమెస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్, కన్సంప్షన్ పడిపోయింది. దీంతో వృద్ధి రేటును 6.1 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. నగదు సమస్య, NBFCలకు ఇబ్బందులు, మందగమనం, కరోనా.. వివిధ కారణాలతో డిమాండ్ పడిపోయింది. కరోనా వైరస్ కారణంగా 2020లో ప్రపంచ వృద్ధి రేటు 1.8 శాతానికి పడిపోతుందని, అమెరికా డీజీపీ 6.2 శాతానికి పడిపోతుందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications