క్రితం సెషన్ వరకు పెరిగిన పసిడి ధరలు నేడు (జూన్ 8, 2022) మాత్రం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కొద్ది సెషన్‌లుగా తగ్గుతున్నప్పటికీ, స్వల్పం మాత్రమే. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్ ఆగస్ట్ ధర నేటి ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గి రూ.50,855 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,084 వద్ద ట్రేడ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.243 తగ్గి రూ.62,000 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.217 తగ్గి రూ.62,740 వద్ద ట్రేడ్ అయింది.
ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు నిన్నటి సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.86 పెరిగి రూ.50,956 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.114 పెరిగి రూ.51,235 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం అతిస్వల్పంగా తగ్గింది లేదా దాదాపు స్థిరంగా ఉంది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కేవలం రూ.19 తగ్గి రూ.62,280 వద్ద ముగిసింది.

గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1850 డాలర్ల పైన ముగిసినప్పటికీ, నేడు మాత్రం ఈ మార్కు దిగువకు వచ్చాయి. అయితే పసిడి ధరలు చాలా రోజులుగా ఈ స్థాయిలోనే కదలాడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో బంగారం ధరలు 1850 డాలర్ల దిగువకు వచ్చాయి. గోల్డ్ ఫ్యూచర్స్ (ఆగస్ట్ 22) నేటి సెషన్‌లో 3.50 శాతం తగ్గి 1848.50 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.105 డాలర్లు తగ్గి 22.073 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఏడాదిలో 3.02 శాతం, సిల్వర్ 20.75 శాతం తగ్గింది.


Click it and Unblock the Notifications