బంగారం ధరలు సోమవారం (జూలై 21) పెరిగాయి. గతవారం భారీగా తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం ఆరంభ సెషన్లోనే ఎగిసిపడింది. అయినప్పటికీ బంగారం రూ.47,000 వద్దే ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా పెరిగి రూ.67,800 దిగువన ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 15 డాలర్ల వరకు పెరిగి 1783 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైన ఉంది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9200 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేలకు పైగా తక్కువగా ఉంది.

బంగారం ధర రూ.354 జంప్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.354.00 (0.76%) పెరిగి రూ.47082.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,155.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,633.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.339.00 (0.72%) పెరిగి రూ.47388.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,144.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,441.00 గరిష్టాన్ని, రూ.46,906.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా జంప్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.162.00 (0.24%) పెరిగి రూ.67760.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,647.00 వద్ద ప్రారంభమై, రూ.67,945.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.66,628.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.109.00 (0.16%) పెరిగి రూ.68758.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,678.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,979.00 గరిష్టాన్ని, రూ.67,717.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 14.40 (0.81%) డాలర్లు పెరిగి 1,783.35 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,764.60 - 1,786.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.054 (0.21%) డాలర్లు పెరిగి 26.005 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.582 - 26.130 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications