Gold Prices Today: బంగారం ధరలు స్థిరంగా, వెండి ధరల్లో స్వల్ప క్షీణత
బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా క్షీణించాయి. పసిడి ఫ్యూచర్స్ రూ.49,000 పైనే ఉంది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7000 తక్కువగా ఉంది. రూ.48,750 స్టాప్ లాస్‌తో, రూ.49550 టార్గెట్‌తో రూ.49,000 వద్ద కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,600 స్టాప్ లాస్‌తో రూ.72500 టార్గెట్‌తో రూ.71300 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

స్థిరంగా బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.28.00 (0.06%) పెరిగి రూ.49171.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,146.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,228.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.49,010.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.54.00 (0.11%) పెరిగి రూ.49475.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,387.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,535.00 గరిష్టాన్ని, రూ.49,320.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా తగ్గుదల
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.334.00 (-0.47%) తగ్గి రూ.71483.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,606.00 వద్ద ప్రారంభమై, రూ.71,750.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,225.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.335.00 (-0.46%) తగ్గి రూ.72622.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,724.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,877.00 గరిష్టాన్ని, రూ.72,437.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 1895 డాలర్ల పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.05 (0.06%) డాలర్లు తగ్గి 1,897.75 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,892.10 - 1,906.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.190 (0.68%) డాలర్లు తగ్గి 27.828 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.733 - 28.110 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications