గతంవారం భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి. రూ.47,500 సమీపానికి చేరుకొని, రూ.48వేల దిశగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. దేశీయంగా పసిడి పెరిగి, వెండి అతి స్వల్పంగా తగ్గింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8700 తక్కువగా ఉంది. ఓ సమయంలో రూ.12,400 తక్కువగా ఉన్న పసిడి, ఈ కాలంలో రూ.3000కు పైగా పెరిగింది.

రూ.47,500కు బంగారం
గత వారం రూ.47వేల పైకి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్లో రూ.47,500 సమీపానికి చేరుకుంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.114.00 (0.24%) పెరిగి రూ.47467.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,353.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,484.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,344.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.139.00 (0.29%) పెరిగి రూ.47730.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,706.00 ప్రారంభమైన ధర, రూ.47,732.00 గరిష్టాన్ని, రూ.47,675.00 కనిష్టాన్ని తాకింది.

వెండి ధరల్లో క్షీణత
వెండి ధరలు కూడా స్వల్పంగా క్షీణించాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.319.00 (-0.46%) క్షీణించి రూ.68365.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,456.00 వద్ద ప్రారంభమై, రూ.68,456.00 గరిష్టాన్ని, రూ.68,104.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.334.00 (-0.48%) తగ్గి రూ.69454.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,284.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,485.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,284.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు స్వల్పంగా తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు గతవారం భారీగా పెరిగాయి. నేడు స్వల్పంగా తగ్గాయి. నేడు 2.80 (-0.16%) డాలర్లు పెరిగి 1,777.40 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,773.45 - 1,783.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.262 (-1.00%) డాలర్లు తగ్గి 25.843 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 26 డాలర్ల దిగువకు వచ్చింది. నేటి సెషన్లో 25.758 - 26.157 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications