వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ టైట్ తాజా వ్యాఖ్యలు బంగారం భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. 2025లో బంగారం ధరలు చూపిన అద్భుతమైన ర్యాలీ 2026 వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి కారణం కేవలం ఒక అంశం మాత్రమే కాదని, స్థూల ఆర్థిక పరిస్థితులు, బలమైన పెట్టుబడి డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రుణ భారం వంటి అనేక అంశాలన్నీ కలిసి బంగారానికి బలమైన మద్దతుగా నిలుస్తున్నాయని టైట్ వివరించారు.
గత ఏడాది బంగారం ప్రదర్శనను 1979 తర్వాత అత్యుత్తమమైనదిగా అభివర్ణించిన టైట్.. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయని, ఇది బంగారంపై దీర్ఘకాలిక విశ్వాసాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. సంస్థాగత పెట్టుబడిదారులకే కాకుండా, వివిధ దేశాల్లో చోటు చేసుకున్న ప్రత్యేక పరిణామాలు కూడా డిమాండ్‌ను పెంచాయని ఆయన వివరించారు.

చైనాలో నియంత్రణ సడలింపులు, దాదాపు 30 ఏళ్ల తర్వాత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న జపాన్‌లో బంగారంపై ఆసక్తి పెరగడం, అలాగే భారతదేశంలో గోల్డ్ ETFలలో పెట్టుబడులు భారీగా పెరగడం ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు. కాగా బంగారానికి అసలైన బలమైన ఆధారం ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ పెరుగుతున్న అప్పుల భారమేనని టైట్ నొక్కిచెప్పారు. ప్రభుత్వాలు, ఆర్థిక వ్యవస్థలు అధిక రుణాలపై ఆధారపడటం కొనసాగుతున్న నేపథ్యంలో.. భద్రమైన పెట్టుబడి సాధనంగా Gold ఆకర్షణ మరింత పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని నమ్మడానికి తనకు ఆరు లేదా ఏడు బలమైన కారణాలు ఉన్నాయని టైట్ తెలిపారు. ఇప్పటికే అనేక బ్యాంకులు, బ్రోకరేజీ సంస్థలు 2026 నాటికి బంగారం ధరలు ఔన్సుకు 4,500 నుంచి 5,000 డాలర్ల మధ్యకు చేరవచ్చని అంచనా వేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ స్థాయిలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పుకొచ్చారు. అమెరికాలో మితమైన ద్రవ్యోల్బణంతో పాటు 6-7 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యమై.. మొత్తం రుణ భారం గణనీయంగా తగ్గే పరిస్థితి ఏర్పడితే, కొందరు పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు జంకవచ్చన్నారు.అయితే అలాంటి దృశ్యం వాస్తవంగా జరగే అవకాశాలు చాలా తక్కువని ఆయన స్పష్టంచేశారు.
ఇక అధిక ధరల కారణంగా ఆభరణాల డిమాండ్ కొంత తగ్గినప్పటికీ, అది స్థిరంగా ఉండి ధరలు స్థిరపడిన తర్వాత తిరిగి కోలుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బంగారానికి అసలైన శక్తి పెట్టుబడి రంగం నుంచే వస్తోందని.. ముఖ్యంగా భౌతిక బార్‌లు, నాణేలు, అలాగే వేగంగా పెరుగుతున్న ETF మార్కెట్ నుంచే ప్రధాన డిమాండ్ ఏర్పడుతోందని చెప్పారు.
భారతదేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన టైట్.. ఇక్కడ Gold ఆర్థికీకరణకు భారీ అవకాశం ఉందన్నారు. రూపాయి విలువ తగ్గడం వల్ల భారతీయ పెట్టుబడిదారులకు బంగారం పెట్టుబడులు మరింత లాభదాయకంగా మారాయని ఆయన తెలిపారు. ఆర్థికంగా అవగాహన ఉన్న యువతరం.. గోల్డ్ ETFలు, గోల్డ్ ఫండ్స్ వైపు వేగంగా మొగ్గుచూపుతోందని, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభావం మరింత బలపడుతుందని ఆయన అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications