Gold Prices Today: బంగారం, వెండి ధరలు పెరిగాయ్
బంగారం ధరలు గత కొంతకాలంగా అస్థిరంగా కనిపిస్తున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లు ఎంసీఎక్స్, కామెక్స్‌లో ధరలు తిరిగి పెరిగాయి. ఎంసీఎక్స్‌లో నేడు పసిడి ధరలు రూ.51,000 క్రాస్ చేయగా, కామెక్స్‌లో 1850 డాలర్లు క్రాస్ చేసి, 1860 డాలర్ల దిశగా పరుగు పెడుతోంది. వెండి ధరలు కూడా రూ.62,500 సమీపించాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేటి ప్రారంభ సెషన్‌లో రూ.134 పెరిగి రూ.51,104 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.29 పెరిగి రూ.51,265 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.765 పెరిగింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,434, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.818 పెరిగి రూ.63,200 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పరుగు పెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం 1810 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్ తిరిగి 1860 డాలర్ల దిశగా వెళ్తోంది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 6.80 డాలర్లు పెరిగి 1857 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.359 డాలర్లు ఎగిసి 22.268 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. యూఎస్ ద్రవ్యోల్భణం డేటా, ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశానికి ముందు బంగారం ధరలు ఊగిసలాటలో కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications