బంగారం ధరలు పెరిగాయ్, రూ.48,576 వద్ద 10 గ్రాముల పసిడి
బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి నేడు (సోమవారం, 24, మే) నేడు సాయంత్రం దాదాపు రూ.200 పెరిగి రూ.48,500 పైకి చేరుకుంది. అమెరికా డాలర్ మూడు నెలల కనిష్టానికి చేరుకుంది. అమెరికా 10 ఇయర్ యీల్డ్స్ వారం కనిష్టం వద్ద ఉన్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పైన ఉంది. ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 తో పోలిస్తే రూ.7,700 వరకు తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.7000 వరకు తక్కువగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.172.00 (0.36%) పెరిగి రూ.48576.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,450.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,600.00కు చేరుకొని, రూ.48,450.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.200.00 వరకు పెరిగి రూ.49000.00ను దాటింది.

రూ.71,750 పైకి వెండి
వెండి ఫ్యూచర్ ధరలు నేడు పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.701.00 (0.99%) పెరిగి రూ.71750.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,517.00 వద్ద ప్రారంభమై, రూ.71,750.00 కంటే పైకి చేరుకొని, రూ.71,404.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.500.00 వరకు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు భారీగా పెరిగాయి. 1900 డాలర్ల దిశగా పరుగెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 7.85 (0.42%) డాలర్లు పెరిగి 1,884.55 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,875.65 - 1,887.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.357 (+1.30%) డాలర్లు పెరిగి 27.843 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.570 - 28.017 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications