ఆర్థిక భద్రతకు ప్రతీకగా పరిగణించబడే బంగారం మళ్లీ భారతదేశంలో వార్తల్లోకెక్కింది. ఇటీవల మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1 లక్ష 20 వేల మార్కును తాకడం పెట్టుబడిదారులు, వినియోగదారులలో ఉత్సాహాన్ని కలిగించింది. ఈ పెరుగుదలతో 2026లో బంగారం ధరలు ఏ స్థాయికి చేరుతాయనే అంశం ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.ఈ నేపథ్యంలో బల్గేరియన్ జ్యోతిష్కురాలు బాబా వంగా ప్రవచనాలు మళ్లీ చర్చలోకి వచ్చాయి.
ఆమె అంచనా ప్రకారం. ప్రపంచం త్వరలో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనవచ్చని, దాని ప్రభావంగా బంగారం విలువ మరింత పెరుగుతుందని చెబుతారు. బాబా వంగా ప్రవచనాలు గతంలో పలు అంతర్జాతీయ సంఘటనలను ముందుగానే సూచించినట్లు అభిమానులు నమ్ముతారు. ఆర్థిక నిపుణులు కూడా బంగారం ధరల పెరుగుదలకు కొన్ని స్పష్టమైన కారణాలను చూపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరత, ఆర్థిక వృద్ధి మందగింపు కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం మళ్లీ 'సేఫ్ హేవెన్ అసెట్'గా ఆకర్షణ పొందుతోందని చెబుతున్నారు.

దీంతో పాటుగా సుంకాల మార్పులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో వడ్డీ రేట్ల మార్పులు కూడా బంగారం మార్కెట్ దిశను ప్రభావితం చేస్తున్నాయి. గత ఆర్థిక సంక్షోభాల సమయంలో ఇదే జరిగింది. ఉదాహరణకు 2008 గ్లోబల్ క్రైసిస్ సమయంలో బంగారం ధరలు 30 శాతం కంటే ఎక్కువ పెరిగిన విషయం తెలిసిందే.
నిపుణుల అంచనాల ప్రకారం.. 2026లో ఒక ఆర్థిక మందగమనమో లేదా ద్రవ్య సంక్షోభమో చోటు చేసుకుంటే, బంగారం ధరలు 25 శాతం నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే 2026 దీపావళి నాటికి భారతదేశంలో 10 గ్రాముల Gold ధర రూ. 1.6 లక్షల నుండి రూ. 1.8 లక్షల మధ్య ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది బంగారం మార్కెట్‌కు చరిత్రాత్మక రికార్డుగా నిలుస్తుంది. పెట్టుబడిదారుల కోసం ఇది ఒక వ్యూహాత్మక హెడ్జ్. అంటే ఆర్థిక అస్థిరతలో రక్షణగా ఉండే ఆస్తి.
అయితే, బాబా వంగా ప్రవచనాలను పూర్తిగా ఆర్థిక సత్యాలుగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ దిశను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ద్రవ్యోల్బణం, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య మార్పులు ముఖ్యమైనవి. కాబట్టి పెట్టుబడిదారులు ప్రవచనాలపై మాత్రమే ఆధారపడకుండా, ఆర్థిక ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలని సలహా ఇస్తున్నారు.
బాబా వంగా అంచనా నిజమవుతుందా లేదా అన్నది కాలమే చెబుతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. అదేంటంటే ప్రపంచం అనిశ్చితిలో ఉన్నప్పుడు బంగారం మెరుపు ఎప్పటికీ తగ్గదు. ఏదేమైనా 2026లో కొత్త రికార్డు గరిష్టాలను బంగారం తాకే అవకాశం ఉంటే, అది పెట్టుబడిదారులకు మరో సువర్ణావకాశంగా మారవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

చైనా మాములుది కాదు..ఇరాన్ యుద్ధంతో ప్రపంచదేశాలు అల్లాడుతుంటే.. అది మాత్రం బంగారంతో..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications