Gold prices today: స్థిరంగా బంగారం ధరలు
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గతవారం రూ.52,000 దిగువకు వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.4 పెరిగి రూ.51,537 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,749 వద్ద ట్రేడ్ అయింది. ఇదే పసిడి ధరలు క్రితం సెషన్‌లో దాదాపు స్థిరంగా ముగిశాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.41 క్షీణించి రూ.51,565 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.54 క్షీణించి రూ.51,781 వద్ద ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.66,300 స్థాయిలో ముగిసింది.
నేటి సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కూడా దాదాపు స్థిరంగా ఉన్నాయి. మే సిల్వర్ ఫ్యూచర్ రూ.29 పెరిగి రూ.66,324 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,050 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.4700 తక్కువగా ఉంది. ఇటీవలి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాటి గరిష్టం రూ.55,500తో పోలిస్తే రూ.4000 తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో పెరిగాయి. కానీ నేడు మళ్ళీ స్వల్పంగా తగ్గాయి. క్రితం సెషన్‌లో కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1934 డాలర్ల వద్ద ముగిసింది. నేడు ప్రారంభ సెషన్‌లో 4.60 డాలర్లు క్షీణించి 1929 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.028 డాలర్లు క్షీణించి 24.562 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.590 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ధరలు రూ.52,000 దిశగా కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications