For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్షీణించిన బంగారం ధరలు, 5 డాలర్లకు తగ్గిన డిస్కౌంట్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఆరు నెలలుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, నెల రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆగస్ట్ 7 ఆల్ టైమ్ గరిష్టం నుండి పసిడి ధరలు ఆరున్నర వేల రూపాయల వరకు క్షీణించింది. ఇప్పటికీ ఇండియన్ డీలర్స్ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు. గతవారం ఔన్స్ 23 డాలర్ల డిస్కౌంట్ ప్రకటించిన డీలర్లు, ఇప్పుడు 5 డాలర్లకు తగ్గించారు. ధరల తగ్గుదల ప్రభావం చూపింది. భారత్‌లో 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీ ఉంటుంది. పండుగకు ముందు పసిడి ధరలు హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత భారీగా తగ్గిన పసిడి ధర: రూ.65వేలకు చేరుకుంటుందా, కొనుగోలుకు ఇదే మంచి సమయమా?ఆ తర్వాత భారీగా తగ్గిన పసిడి ధర: రూ.65వేలకు చేరుకుంటుందా, కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

వారంలో ఎంత తగ్గిందంటే?

వారంలో ఎంత తగ్గిందంటే?

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు గత వారం తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,600 పైన సెటిల్ అయింది. కిలో వెండి రూ.59వేల పైన సెటిల్ అయింది. గత వారంలో పసిడి రూ.2000 వరకు క్షీణించింది. వెండి కిలో రూ.9000 తగ్గింది. బంగారం రూ.56,200 నుండి రూ.49,500 స్థాయికి క్షీణించింది. వెండి రూ.78వేల పై నుండి రూ.59వేలకు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో ఈ వారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1500 వరకు క్షఈణించింది. ధర రూ.52,500 లోపుకు పడిపోయింది. 22 క్యారెట్ల పసిడి రూ.1,200 తగ్గి రూ.48వేలకు దిగి వచ్చింది. వెండి ధర కూడా కిలో రూ.7,700కు పైగా పతనమైంది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుండి డిమాండ్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు శుక్రవారం ఔన్స్ 1866 డాలర్లు పలికింది. అంతకుముందు కంటే 10 డాలర్లు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఓ సమయంలో ఔన్స్ 2,075 పైకి చేరుకున్నాయి. ఇటీవలి గరిష్ట ధరతో పోలిస్తే పసిడి ధరలు 200 డాలర్ల కంటే పైన క్షీణించింది. పసిడి ధరలు మద్దతు 1889.70 డాలర్ల నుండి 1842.60 డాలర్ల మధ్య ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ధరల క్షీణత..

ధరల క్షీణత..

కరోనా కారణంగా మార్చి నుండి బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆగస్ట్ రెండో వారం నుండి ధరలు క్షీణిస్తున్నాయి. దాదాపు ఈ రెండు నెలల్లో రూ.ఆరున్నర వేలు క్షీణించింది. చాలా రోజులుగా పసిడి ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ వారం ఏకంగా రూ.2,000కు పైగా తగ్గింది. ఇక వెండి ఏకంగా రూ.10వేల వరకు తగ్గింది. ఓ వారంలో పసిడి, వెండి భారీగా తగ్గడం మార్చి నుండి ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఈ వారం 4.6 శాతం మేర క్షీణించాయి. వెండి ధరలు 15 శాతం మేర తగ్గాయి.

English summary

క్షీణించిన బంగారం ధరలు, 5 డాలర్లకు తగ్గిన డిస్కౌంట్ | Gold sold at a discount even as prices fall Rs 6,500 from highs

Indian dealers continued to offer discounts for the sixth week on gold though price cuts eased as rates fell sharply this week. Indian dealers offered discounts of up to $5 an ounce this week over official domestic prices, down from last week's $23, Reuters reported, saying that a drop in prices saw a little interest return in the precious metal. Gold prices in India include 12.5% import duty and 3% GST.
Story first published: Sunday, September 27, 2020, 20:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X